24.7 C
Hyderabad
March 26, 2025 10: 47 AM
Slider రంగారెడ్డి

జర్నలిస్టులకు నిత్యావసరాలు ఇచ్చిన మర్రి రాజశేఖర్ రెడ్డి

#MarriRajasekharReddy

మేడ్చల్ జిల్లా పరిధిలోని 300 మందికి పైగా మండల స్థాయి జర్నలిస్టులకు టిఆర్ఎస్ పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ తీవ్రత వల్ల విధించిన లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టుల విషయాన్ని మేడ్చల్ జిల్లాTUWJ అధ్యక్షుడు బొమ్మ అమరేంద్ర తెలపడంతో మర్రి రాజశేఖర్ రెడ్డి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

కీసర, జవహర్ నగర్, మేడ్చల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ లు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మొత్తం 300 మంది ఈ సాయం అందుకున్నారు. 25 కేజీల రైస్  తో పాటు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ తో పాటు గౌరవాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఐజేయూ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నాగారం చైర్మన్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.

ఇంకా దమ్మాయిగూడ చైర్మన్ వసుమతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కీసర మండల ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, సత్తిరెడ్డి, కీసర సర్పంచ్ మాధురి, గోల్కొండ సర్పంచ్ మహేందర్ రెడ్డి తో పాటు స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నీలాచలం కొండకు భారీ ర్యాలీ కోసం బీజేపీ ప్రణాళిక

Satyam NEWS

మల్దకల్ దేవాలయ అభివృద్ధికి సహకరించండి

mamatha

ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment