32.7 C
Hyderabad
April 27, 2024 01: 38 AM
Slider విజయనగరం

ప్ల‌యింగ్ స్క్వాడ్ దాడులు ప్రైవేటు హాస్ప‌ట‌ల్ పై కేసు….!

#VijayanagaramHospital

నిన్న కాక మొన్న జిల్లా కేంద్ర హాస్ప‌ట‌ల్ లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా విఫ‌లైమ‌న కార‌ణంగా న‌లుగురు మృతి చెందిన ఘ‌టన సంచ‌ల‌న‌మే అయ్యింది.స్వ‌య‌నా డిప్యూటీ సీఎం రంగంలోకి దిగ‌డంతో ఆ మ‌ర్నాడే కేంద్ర హాస్ప‌ట‌ల్ డాక్ట‌ర్లు మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ…వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

ఇదిలా ఉంటే కేంద్ర హాస్ప‌టలో జ‌రిగిన ఘ‌ట‌న‌లో జిల్లా యంత్రాంగం మేల్కొంది. వ‌రుస‌గా జిల్లా క‌లెక్ట‌ర్, డీఎంఅండ్ హ‌చ్ ఓ తో వ‌రుసగా స‌మీక్ష‌లు జ‌ర‌ప‌డం,క‌రోనా హాస్ప‌ట‌ల్స్ సంఖ్య , అందుకు సంబంధించి బెడ్స్ పెంచ‌డం వంటి చ‌ర్య‌ల‌పై దృష్టి సారిస్తున్నారు. 

జిల్లా కేంద్రంలో కేటాయించిన క‌రోనా హాస్ప‌ట‌ల్స్ పని తీరును సంబంధిత స‌మ‌ర్వ‌య అధికారి చూస్తున్నారు కూడ‌.

ఈ  త‌రుణంలోనే డ్ర‌గ్స్ అండ్ విజిలెన్స్ శాఖ సంబందింత ప్రైవేటు హ‌స్ప‌ట‌ల్సై దృష్టి పెట్ట‌గా  ఎన్సీఎస్ ధియేట‌ర్ వ‌ద్ద ఉన్న క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్స‌ట‌ల్ లో రెమిడీసీవ‌ర్ ఇంజ‌క్ష‌న్ల కొనుగోలులో అవ‌త‌క‌లు గుర్తించారు.

ఆ వెంట‌నే వ‌న్ టౌన్ పోలీసుల స‌హాకారంతో గ‌త అర్ద‌రాత్రి హాస్ప‌ట‌ల్ లో త‌నిఖీలు చేసారు. ఆ వెంట‌నే హాస్ప‌ట‌ల్  కు చెందిన ర‌మేష్,వివేక్ ల‌ను పోలీసులు విచారించారు.

హాస్ప‌ట‌ల్, యాజమాన్యం పై ఐపిసి 188, 420, 406, 120 బి, 468 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ఆసుపత్రి ఎండి రమేష్‌, జనరల్‌ ఫిజిషియాన్‌ వివేక్ ల‌ను విచారించారు..

అలాగే ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్‌ తోపాటు మరికొంతమందిని విచారణ చేస్తున్నామ‌ని పూర్తి స్థాయిలో విచార‌ణ చేప‌ట్టిన త‌ర్వాత అరెస్టులు ఉంటాయ‌ని న‌గ‌ర వ‌న్ టౌన్ సీఐ ముర‌ళీ తెలిపారు.

Related posts

“నా ఓటే నా భవిష్యత్తు – ఒక ఓటు యొక్క శక్తి”: ఓటరు అవగాహన పోటీలు

Satyam NEWS

ప్రభుత్వ ఉద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న వారితో జరభద్రం…!

Satyam NEWS

ప్రభుత్వ బోట్లు ఆగితే ప్రయివేటు బోటు ఎందుకు నడిపారు?

Satyam NEWS

Leave a Comment