దహేగాం మండలంలో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన రౌతు బండు కేసును పోలీసులు చాకచక్యంగా ఛేధించారు. మృతుడి భార్య కవిత మరో వ్యక్తి (బిక్కు) తో అక్రమ సంబంధం పెట్టుకుంది. బిక్కు అనే ఈ ప్రియుడితో కలసి అక్రమ సంబంభానికి అడ్డుగా వస్తున్నాడని భర్తనే హత్య చేసింది.. హత్య తాలుకా పూర్తి వివరాలను కాగజ్‌నగర్ డిఎస్పి బిఎల్ ఎన్ స్వామీ ప్రెస్ మీట్ లో తెలిపారు. తక్కువ సమయంలో చాకచక్యంగా హత్య కేసును చేదించిన కాగజ్‌నగర్ రూరల్ సిఐ. నరేందర్ ను జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, డిఎస్పిస్వామీ అభినందించారు. స్థానిక దహేగాం ఎస్ఐ రఘుపతిని, ఇతర పోలీసు సిబ్బందిని కూడ పోలీసులు అధికారులు అభినందించారు.
previous post