30.7 C
Hyderabad
April 29, 2024 04: 56 AM
Slider కరీంనగర్

నిరుపేద ఆడబిడ్డలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్

#ministergangulakamalakar

పేద కుటుంబాల నుండి వచ్చిన వాళ్లు బిడ్డ పెండ్లి చేయడానికి పడే తపన వర్ణనాతీత మని, ఆ బాధ ను తొలగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణాలక్ష్మి, షాదీ ముబారక్  పథకాలను ప్రవేశపెట్టారని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని సిటీ సెంటర్ హల్ లో 55 మంది లబ్ధిదారులకు నేడు ఆయన కళ్యాణాలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంచిపెట్టారు.

అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ ఒకనాడు బిడ్డ పెండ్లి చేయాలంటే ప్రతీ కుటుంబం ఎంతో భారాన్ని భరించేదని, ఎదిగిన బిడ్డను చూసి మంచి పెళ్లి చేయాలని తల్లి బాధపడుతూ, మంచి సంబందం చూసి ఇవ్వాలని ఆశపడేదన్నారు. నాటి పరిస్థితుల్లో పుట్టింటోళ్లను అడిగినా, అన్నదమ్ములను అడిగినా పెండ్లికి అవసరమైన డబ్బులు పుట్టేటివి కావని, విధి లేని పరిస్థితుల్లో తన దగ్గరున్నవి కుదువ పెట్టి అప్పు చేసి పెండ్లి చేసేవారని ఆయన అన్నారు. ఆ అప్పు తీర్చలేక భూముల్ని అమ్ముకునేవారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.  

అలాంటి వారి పెండ్లికోసం ప్రభుత్వమే లక్షా పదహారువేలు ఇచ్చే కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు లేవని, కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తెలంగాణలో మాత్రమే కళ్యణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమలవుతున్నాయన్నారు. ఈ డబ్బుల్ని మల్లీ ఎవరికీ కట్టాల్సిన అవసరం లేదని, ఘనంగా మీ బిడ్డ పెళ్లి చేసుకోవడానికే వాడుకోవాలన్నారు మంత్రి గంగుల.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు లేవు

మోడీ సీఎంగా సుధీర్ఘ కాలం పనిచేసిన గుజరాత్ లోనూ, బిజెపి అధికారంలో ఉన్న యూపీలోనూ ఇతర బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవన్నారు. కేవలం కళ్యాణలక్ష్మీతోనే ఆగకుండా పెళ్లి తర్వాత కాన్పు కోసం కార్పోరేట్ కు దీటుగా లక్షల రూపాయల వైద్యాన్ని ఉచితంగా అందించడమే కాక 13వేల రూపాయల్ని కేసీఆర్ కిట్ రూపంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పుట్టిన బిడ్డలకు ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి వేల గురుకులాలు ఏర్పాటు చేసారన్నారు.

ప్రతీ ఒక్కరూ తెలంగాణకు ముందు ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారినా ఎందుకు కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, గురుకులాలు, ఆసరా ఫించన్లు, రైతుబందు, 24గంటల కరెంటు, ధళితబందు లాంటి ఎన్నో పథకాలు ఎందుకు లేవో ఆలోచించాలన్నారు. కేవలం తెలంగాణలోనే అదీ కేసీఆర్ సర్కార్ మాత్రమే ఇలాంటి పథకాల్ని ఎందుకు అందిస్తున్నదో ఆలోచించాలన్నారు. కేవలం మనసుగల ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో మనకున్నారు కాబట్టే ఈ పథకాలు వస్తున్నాయనేది గుర్తించాలన్నారు మంత్రి గంగుల.

సంక్షేమ పథకాలు వద్దనే బిజేపీ మనకెందుకు?

ఈ రోజు హుజురాబాద్ ఎన్నికల కోసం వస్తున్న బీజేపీ నాయకుల్ని ఈ పథకాలు వాళ్ల దగ్గర ఎందుకు లేవో ప్రశ్నించాలన్నారు. ఇప్పుడు మీ ఓట్ల కోసం వస్తున్న మాజీ ఎమ్మెల్యే గతంలో కళ్యాణలక్ష్మీ ఇతర పథకాల్ని పరిగలతో పోల్చి అవమానించారని, పేదలకు సంక్షేమ పథకాలు వద్దనే బీజేపీ వైపుందామా?, అన్ని రకాలుగా అండగా ఉంటున్న కేసీఆర్ వైపుండాలా ఆలోచించుకోవాలన్నారు.

సివిల్ సప్లైస్ ద్వారా ప్రతీ పేద కుటుంబం కడుపు నింపుతున్నామని, కరోనా సంక్షోభంలో ప్రతీ ఒక్కరికీ 15 కిలోల ఉచిత బియ్యం ఇవ్వడమే కాకుండా, పదిహేనువందల రూపాయల్ని సైతం అందించిన ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. కళ్యాణలక్ష్మీ పథకాల్ని అమలు చేసే బీసీ సంక్షేమ శాఖకు నిధుల్ని సమకూర్చారన్నారు. ఇంతలా మనకు అండగా ఉండి ఆదరించే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దీవెనార్థులు పెట్టాలని, మరింత కాలం ఎక్కువ సేవ చేసేలా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకోవాలన్నారు మంత్రి గంగుల. కళ్యాణలక్ష్మీ ఇస్తున్న కేసీఆర్కి అండగా ఉండాలా, వద్దన్న వారికి మద్దతియ్యాల ప్రజలు నిర్ణయించాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు,  ఆర్డీవో రవీందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గాందే రాధిక, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల, జెడ్పిటిసి పడిద బక్కరెడ్డి, కల్లెపల్లి రమాదేవి ,ముత్యం రాజు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Related posts

ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్ లో జగన్ పెద్ద కుమార్తెకు సీటు

Satyam NEWS

జీఓ 4 ప్రకారం జీతాలు చెల్లించాలి

Murali Krishna

భారీ ఎత్తున అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

Satyam NEWS

Leave a Comment