కామారెడ్డి జిల్లా కేంద్రంలో 12 వ రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా నేడు భిక్షాటన చేపట్టారు. కామారెడ్డి పట్టణం మొత్తం పోతారాజుల విన్యాసాలతో ర్యాలీ చేపట్టి కనపడిన వారినల్లా బిక్షం అడిగారు. 12 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం చర్చలకు పిలవడం లేదని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం వద్ద ఆర్టిసినీ రక్షించేందుకు నిధులు లేవని ఆర్టిసినీ కాపాడుకొనేందుకు తాము ఇలా బిక్షమెట్టుకుంటున్నామని వాపోయారు. 48 వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డా ప్రభుత్వం చలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ పూట ప్రజలను ఇబ్బందులు పెట్టాలని లేకున్నా తమ సమస్యల పరిష్కారానికి సమ్మె ఒక్కటే మార్గమని భావించి సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాతనే తాము సమ్మెకు దిగామని తెలిపారు. కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం తమను చర్చలకు పిలిస్తే వెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి చర్చలకు ఆహ్వానించి తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు
previous post