26.2 C
Hyderabad
November 3, 2024 21: 41 PM
Slider ఆంధ్రప్రదేశ్

కోడెల చర్యలపై మండిపడుతున్న కమ్మకులస్తులు

kodela_710x400xt

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన పని పై కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కమ్మ సామాజిక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవనీయమైన పదవిలో ఉన్న కోడెల శివప్రసాదరావు అసెంబ్లీకి చెందిన ఫర్నీచర్ ను తీసుకుని సొంతానికి వాడుకోవడం దారుణమైన వ్యవహారమని వారు భావిస్తున్నారు. కోడెల చేసిన ఈ పనితో కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన కమ్మ కులస్థులపై ఇతర కులాల వారికి ఏహ్యభావన ఏర్పడుతున్నదని వారు అంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి తాము తీవ్రమైన అవమానాలకు గురి అవుతున్నామని ఈ దశలో కోడెల శివప్రసాదరావు చేసిన ఈ నిర్వాకం బయటకు రావడం తో తమ కులం పట్ల అందరూ చిన్న చూపు మొదలు పెట్టారని వారు అంటున్నారు. తమను దొంగల్లా చూస్తున్నారని ఆ కులానికి చెందిన ఒక పెద్ద నాయకుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కోడెల శివప్రసాదరావు చేసిన పనికి మద్దుతు ఇవ్వవద్దని వారు కోరుతున్నారు. కేంద్రంలో ఆర్ధిక నేరాలపై అరెస్టు అయిన చిదంబరం కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిందని, ఆంధ్రప్రదేశ్ లో కూడా కోడెలకు మద్దతుగా నిలిస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అలానే తయారవుతుందని కమ్మ కులస్తులు అంటున్నారు. కమ్మ కులస్తుల మనోభావాలకు అనుగుణంగానే చంద్రబాబునాయుడు కూడా కోడెలకు మద్దతు తెలిపే పరిస్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదు. అసెంబ్లీకి చెందిన కోటి రూపాయల విలువైన ఫర్నీచర్ ఇతర వస్తు సామాగ్రిని కోడెల శివప్రసాదరావు తన సొంతానికి వాడుకున్నట్లు పోలీసు కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుతో కృష్ణా, గుంటూరు జిల్లాల కమ్మ వారు ఎంతో కుమిలిపోతూ అవమాన భారంతో ఉన్నారు. కోడెలను ఎట్టిపరిస్థితుల్లో కమ్మ కులం సమర్దించదని వారు అంటున్నారు. ఇలాంటి నీచమైన బుద్ధి ఉన్నవారిగా తాము పదుగురిలో చులకన కాదలచుకోలేదని అందుకే కోడెలకుమద్దతు ఇచ్చేది లేదని కమ్మకులస్తులు అంటున్నారు.

Related posts

ప్రధాని సలహాలు సూచనలు పరీక్షలు రాసే ప్రతి విద్యార్థి పాటించాలి

Satyam NEWS

మురుగుపారు…పశువులు సేద తీరు…

Bhavani

బిర్యానీలో వెంట్రుకలు వచ్చినందుకు లక్ష జరిమానా

Satyam NEWS

Leave a Comment