25.2 C
Hyderabad
January 21, 2025 11: 14 AM
Slider తెలంగాణ

ఎంపీ మిస్సింగ్:అజ్ఞాతంలోకి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌

bandi sanjay caa

నిన్నటి వరకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం తో బిజీ గా గడిపిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వ్యక్తిగత సెక్యూరిటీకి కూడా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అయన భద్రతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఎంపీ సంజయ్ ఫోన్‌ కూడా స్విచాఫ్‌ రావడంతో వారు మరింత ఆందోళన పడుతున్నారు.

తన ప్రచారంలో రాళ్ల దాడి జరిగిందని బండి సంజయ్‌ చెబుతుండగా అలాంటిది ఏమీలేదని కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఇరువురి మధ్య వివాదం మరింత ముదిరినట్లు తెలుస్తోంది.కాగా నిన్న రాత్రి బీజేపీ అభ్యర్థి పై తెరాస దాడి చేయగా ఆ విషయమై పోలీస్ లతో చర్చించగా వివాదం మరింత ముదిరిందని కార్యకర్తల అనుమానం.

కాగా ఆయనకు భద్రతా కల్పిస్తానన్న అయన వద్దని వారించడం,పార్లమెంట్ లో పోలీస్ లు తన పై దాడి చేశారని ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడం తో గత కొద్దీ రోజులుగా పోలీసులకు ఎంపీ కి మధ్య వివాదం ముదురుతుండటం గమనార్హం.ఈ నేపత్యం లో సంజయ్ విశ్రాంతి కొరకు అన్నిటికి దూరంగా వెల్లడా లేక పోలీస్ లతో వివాదం కారణంగా అజ్ఞాతంలోకి లోకి వెల్లడా అనే అనుమానం ప్రజల్లో కలుగుతుంది.

Related posts

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఫైనాన్సర్

Satyam NEWS

రాజంపేట లో బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రక్తదానం

Satyam NEWS

మజ్లీస్ మద్దతుతో మేయర్ పీఠంపై టీఆర్ఎస్ అభ్యర్ధి

Satyam NEWS

Leave a Comment