26.2 C
Hyderabad
December 11, 2024 19: 09 PM
Slider ప్రపంచం

కాశ్మీర్ అంశంపై మళ్లీ ట్రంప్ వివాదం

imran,trump,modi

జమ్మూ కాశ్మీర్ వివాదంలో భారత్ పాకిస్తాన్ కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యల్ని పాకిస్తాన్ స్వాగతించగా భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చల్లో మూడో దేశం జోక్యాన్ని, మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కాశ్మీర్‌ అంశంపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది రెండో సారి. పాక్‌, భారత్‌ కోరితే కాశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానంటూ మరోసారి వ్యాఖ్యానించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించడం కూడా విశేషం. మధ్యవర్తిత్వంపై భారత్‌ స్పందనను ప్రస్తావిస్తూ శ్వేతసౌధంలో ఓ విలేకరి లేవనెత్తిన ప్రశ్నకు బదులిస్తూ ఆ విషయాన్ని ప్రధాని మోడీకే విడిచిపెడుతున్నాను అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. పైగా తన మధ్యవర్తిత్వానికి భారత్‌ అంగీకరించిందా? లేదా? అని విలేకరుల నుంచి స్పష్టత కోరే ప్రయత్నం చేశారు. ఇటీవల పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా అధ్యక్షుడితో భేటీ అయిన విషయం తెలిసిందే. తనకు తెలిసినంత వరకు ఇమ్రాన్‌ ఖాన్‌, మోడి అద్భుతమైన వ్యక్తులు. వారి మధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను అని ట్రంప్ అన్నారు. ఒకవేళ వారు ఎవరైనా జోక్యం చేసుకోవాలని భావిస్తే దానికి నేను సిద్ధం. ఈ అంశంపై నేను పాకిస్థాన్‌తో చర్చించాను. భారత్‌తో కూడా ధైర్యంగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Related posts

స్పందన ద్వారా బాధితుల నుంచి 40 ఫిర్యాదులు స్వీకరణ

Satyam NEWS

ఇసుక స్టాక్ యార్డులో మరో మహిళ దారుణ హత్య

Satyam NEWS

థాంక్ గాడ్: ఊపిరి పీల్చుకున్న నాగర్ కర్నూల్

Satyam NEWS

Leave a Comment