20.7 C
Hyderabad
December 10, 2024 01: 46 AM
Slider ముఖ్యంశాలు

ఆందోళన బాటలో మోజో టీవీ ఉద్యోగులు

Mojo TV

ఆవిర్భవించిన అనతి కాలంలోనే ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మోజో టీవీ యాజమాన్యం మారినప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొంటున్నది. సంస్థ స్థాపించినప్పటినుంచి ఒకటవ తేదీన మధ్యాహ్నం లోపు జీతాలు వచ్చేవి, ఏ ఉద్యోగికి అయిన ఇబ్బంది ఉంది అంటే వారం రోజుల ముందు జీతాలు ఇచ్చే వారు, మోజో లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కుటుంబం కూడా టైం కు జీతం వస్తుంది అని  నిశ్చింతగా. ఉండేది..అలాంటిది ఈరోజు ఉదయం అందరిని పిలిచి ఛానల్ నడిపించడానికి మా దగ్గర డబ్బులు లేవు మీకు ఎంతో కొంత ఇస్తాం అందరూ వెళ్లిపోండి అని చావు కబురు చల్లగా చెప్పారు. దాంతో మోజో టీవీ సిబ్బంది ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ వివరాలు : మోజో టీవీని మై హోం రామేశ్వరరావు తదితరులకు సంబంధించిన కంపెనీల వారు తమ ఆధీనంలోకి తీసుకుంటున్న సమయంలో అప్పటి మోజో టీవీ సీఈఓ రేవతి స్టూడియో లోనే నిరాహారదీక్ష చేసారు. మోజో లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాలతో రామేశ్వర్ రావు అడుకుంటున్నారని ఉద్యోగుల తరుపున ఫైట్ చేశారు. అయితే రేవతి కుటుంబ సభ్యులను పోలీస్ లతో బెదిరించారు. ఆమె పై అక్రమ కేసులు పెట్టి ఒక మహిళ అని కూడా చూడకుండా పోలీస్ లు ఆమె ఇంటి పై దాడి చేసి బలవంతంగా ఈడ్చుకెళ్లి 10 రోజులు జైల్ లో పెట్టారు. మోజో ను మూసేస్తే వందల కుటుంబాలు రోడ్డున పడుతాయి మోజో ను వదిలెయ్యండి మేము నడుపుకుంటాం అని అప్పటిలో రేవతి ప్రాధేయపడ్డారు ఆయిన కార్పొరేట్ శక్తులు మోజో టీవీ ని కూడా వదలలేదు. నిన్న జై తెలంగాణ టీవీ, ఈరోజు మోజో, రేపు 10 టీవీ ఆ తరువాత లాభాలు రాక పోతే టీవీ9 కూడా మూసేస్తారు. కార్పొరేట్ శక్తులకు లాభాలు కావాలి జర్నలిస్ట్ జీవితాలు ఎందుకు. ఆరోజు మోజో రేవతి ఇది జరగబోతుంది అని ఊహించి పోరాటం మొదలు పెట్టింది కానీ ఏ జర్నలిస్ట్ సంఘము ఆమె మద్దతు గా రాలేదు, దాంతో ఈరోజు 160 కుటుంబాలు రోడ్డున పడ్డాయి, తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటి అని నిలదీయడానికి మా కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వర్ ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయించాం మీరందరూ మాకు మద్దతు గా రావాలని కోరుకుంటున్నాం..ఇట్లు మోజో ఉద్యోగులు

Related posts

Analysis: అటూ ఇటూ కమలానికి ‘కాపు’ రెక్కలు

Satyam NEWS

ప్రభుత్వ చర్యలు నిరసిస్తూ ఏలూరు లో ప్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా

Satyam NEWS

కొట్టేసిన చట్టం కింద కేసులు పెడుతున్న పోలీసులపై సుప్రీం ఆగ్రహం

Satyam NEWS

Leave a Comment