28.7 C
Hyderabad
April 27, 2024 03: 25 AM
Slider కవి ప్రపంచం

మా పూజలందించాము

#gudipallinarasimhareddy

అమ్మ వాసవి మాత

మీ కరుణ జూపి

మమ్ము కాపాడుము తల్లి

లోకమంతట నిండె

వింత వ్యాదొకటొకచ్చి

ఉక్కు పాదము మోపి

మా ఊపిరులను ఆపింది

మేమెరిగి నోళ్ళు యంత

మానుండి దూరముజేసి

కడప దాటకుండ

కట్టడిని జేసింది

గుడి గోపురములన్ని

మూతబడి పోవంగ

మొర వినెడి దేవుడే

గుడిలోని బందీయయ్యే

మహమ్మారి కరోనా

విషపు కోరలనీడన

దినదినపు గండంగా

చచ్చి బ్రతికినమమ్మ

లోకాన కదిలాడు

ప్రతి ప్రాణి నీవలనంట

నమ్మినా మా బ్రతులను

వమ్ము చేయకు తల్లి

శివుడి నొసటి మూడో కన్ను నీవేనంట

దుష్టులను దునుమాడు

దుష్ట సంహారివి యంట

లోకాన కరోనపై మాడ్చి మసిగాజేసి

నీ సుతి సుతుల కాపాడు

మా కనకదుర్గమ తల్లి

గుడిపల్లి నర్సింహారెడ్డి

Related posts

క్షయ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం

Satyam NEWS

వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ వివిధ పార్టీల బీసీల ధర్నా

Bhavani

ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో నిలిచిపోయిన డిక్లరేషన్

Satyam NEWS

Leave a Comment