26.7 C
Hyderabad
April 27, 2024 07: 36 AM
Slider రంగారెడ్డి

తెలంగాణ ద్రోహులతో దోస్తీ చేస్తున్న సీఎం కేసీఆర్

#etalarajendar

రాజకీయ క్రీడ తప్ప మరో ధ్యాస లేని సీఎం కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ద్రోహులు అయిన సిపిఎం పార్టీతో దోస్తానా చేస్తుండటం శోచనీయమని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో సీనియర్ నాయకులు కక్కునూరి వెంకటేష్ గుప్తా స్వగృహంలో స్థానిక ఇంచార్జ్ ఎన్. శ్రీవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే కేసీఆర్ తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డ సిపిఎం పార్టీని చేర దీస్తున్నారని విమర్శించారు. నిత్యం రాజకీయ క్రీడలతో కాంగ్రెస్ లో ఎలా పుల్లలు పెట్టాలి లేదా బీజేపీని ఎలా దెబ్బతీయాలి అనే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజల డబుల్ బెడ్ రూమ్ సమస్యలు, పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాల వరకు పెన్షన్ ఇవ్వడం, లక్షల మంది ప్రజానీకానికి భూములు గల్లంతై ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే అవి పరిష్కారంకు నోచుకోక, ఎమ్మార్వో, ఆర్డీవో వద్ద పరిష్కారం కాక, చివరికి కలెక్టర్ కూడా సమస్య తీర్చకుండా చేతులు ఎత్తేసిన వైనం దారుణమన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి లేక అవస్థలు పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగులకు స్థానికత ఆధారంగా  ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని అనుసరించి ఉద్యోగ నియామకాల్లో జిల్లా పోస్టులని, జోనల్ పోస్టులని రాష్ట్ర స్థాయి పోస్టులు ఉంటాయని అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాల స్థానంలో 33 జిల్లాలను పెంచుకోవటం జరిగిందన్నారు.  తెలంగాణ 33 జిల్లాల్లో 2 జోన్లకు బదులు 7 జోన్లు పెరిగినట్టు పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి ద్వారా ఆమోదించి జీవో నెంబర్ 124 ఇచ్చారని గుర్తు చేశారు.

3సంవత్సరాల కాల పరిమితిలో ఉద్యోగులను కానీ, టీచర్లను కానీ యూనిఫామ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఉద్యోగులను కానీ స్థానికత ఆధారంగా ఇచ్చిన గైడ్ లైన్స్ ఆధారంగా ఉద్యోగ పంపకాలు చేసుకోమని జిల్లాల వారిగా జోన్ల వారిగా కేటాయింపు చేయమని చెబితే 3సంవత్సరాల కాలం పాటు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు సంవత్సరాల తర్వాత ఇవ్వాళ 317 జీవో తెచ్చి ఉద్యోగుల కుటుంబాల్లో ప్రశాంతత లేకుండా చేశారని విమర్శించారు. భార్య ఒక దగ్గర భర్త మరో దగ్గర, పిల్లలు, కన్న తల్లిదండ్రులు ఇంకో దగ్గర

ఎడబాటు విధించి పల్లె పల్లెల్లో వారి కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా చేసిన ముఖ్యమంత్రి, ఇవాళ మనశ్శాంతి కరువై టీచర్లు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎపి మిథున్ రెడ్డి, నాయకులు అందే బాబయ్య, అశోక్ గౌడ్, కక్కునూరి వెంకటేష్ గుప్తా, వెంకటేశ్వర రెడ్డి, విజయ్ కుమార్, కమ్మరి భూపాల చారి, ఎంకనోళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

యువగళం పై హత్యాయత్నం కేసులు పెట్టిన పోలీసులు

Bhavani

కరోనా డ్యూటీలలో అలసత్వం వద్దు: ప్రకాశం జిల్లా ఎస్ పి

Satyam NEWS

వైకాపా నేతల కనుసన్నల్లో జూదం మాఫియా

Bhavani

Leave a Comment