26.7 C
Hyderabad
April 27, 2024 08: 53 AM
Slider ముఖ్యంశాలు

రాహుల్ గాంధీ కి ముఖ్యమంత్రి కెసీఆర్ సంఘీభావం

#kcr

“భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన  పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బిజేపి ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బిజేపి దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి..” అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు.

Related posts

ఐ ఎన్ టి యు సి కరపత్రాల ఆవిష్కరణ

Satyam NEWS

ప్రత్యేక హోదా పై ప్రశ్నించేందుకు భయమా

Satyam NEWS

కరోనా కష్టకాలంలోనూ రైతుకు బాసటగా ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment