33.2 C
Hyderabad
June 17, 2024 15: 31 PM
Slider కృష్ణ

కొడాలి నానిని పార్టీ నుండి బహిష్కరించాలి

#balaji

కొడాలి నాని కాపులను అసభ్యకరంగా దూషించి అవమానించినందుకు తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ హద్దు అదుపు లేకుండా బూతులు మంత్రిగా పేరుపొందిన కొడాలి  నాని కాపులను దూషించటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బాలాజీ అన్నారు. ఒక బాధ్యత గల శాసనసభ్యుడు బహిరంగంగా కాపులను కులం పేరుతో బూతులు తిట్టడం ఎంతవరకు సమంజసం అని బాలాజీ ప్రశ్నించారు.

రంగా విగ్రహాలకు దండలు వేసి, రంగా గారి కుమారుడి తో మాట్లాడితే సరిపోదని, సాటివారిని గౌరవించడం తెలుసుకోవాలని బాలాజీ అన్నారు. సంస్కారం లేకుండా మాట్లాడిన కొడాలి నానిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బాలాజీ డిమాండ్ చేశారు. కొడాలి నాని మాటలకు వైఎస్ఆర్సిపి లోని కాపు నాయకులు పెదవి విప్పి కాపు సమాజానికి సమాధానం చెప్పాలని కూడా బాలాజీ డిమాండ్ చేశారు.

సంస్కారం లేని సభ్యత లేని శాసనసభ్యులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు అడుగు వేయలేదని బాలాజీ హెచ్చరించారు. తక్షణమే జగన్మోహన్ రెడ్డి  కొడాలి నానితో కాపు వర్గానికి క్షమాపణ చెప్పించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా కాపు వర్గాలన్నీ కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతాయని బాలాజీ హెచ్చరించారు. తక్షణమే కొడాలి నాని పై బేషరతుగా పోలీసులు సుమోటోగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా బాలాజీ డిమాండ్ చేశారు.

Related posts

రూ.2 వేల మద్యం బాటిల్ రూ.300 తక్కువకే

Satyam NEWS

కల్యాణమస్తు జంటలకు 2 గ్రాముల బంగారు తాళిబొట్లు

Satyam NEWS

రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment