34.3 C
Hyderabad
March 8, 2021 17: 22 PM
Slider ముఖ్యంశాలు

డిజిటల్‌ అబాకస్‌ అభ్యాస యాప్‌ను అభివృద్ధి చేసిన లెర్న్‌క్లూ

#LearnClue

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలల కోసం హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఎడ్యుకేషన్‌ యాగ్రిగేటర్‌ స్టార్టప్‌, లెర్న్‌ క్లూ డిజిటల్‌ అబాకస్‌ అభ్యాస మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది. డిజిటల్‌  రూపంలో  ప్రపంచంలో మొట్టమొదటి అబాకస్‌ గా చెప్పే ఈ యాప్‌తో  విద్యార్థులు యాప్‌ లోనే అబాకస్‌ను అభ్యసించవచ్చు. దీనితో పాటుగా నిష్ణాతుల నుంచి లైవ్, రికార్డడ్‌ సదస్సులనూ వీక్షించవచ్చు.

‘‘పురాతన గ్రీస్‌లో పుట్టిన అబాకస్‌కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అమితాదరణ ఉంది. చైనా, జపాన్‌, రష్యా వంటి దేశాలలో చిన్నారులకు ఇది తప్పని సరి కార్యక్రమంగా ఉంది. దీనిని సమగ్రమైన మెదడు అభివృద్ధి కార్యక్రమంగా కూడా భావిస్తున్నారు.

అబాకస్‌  ఇప్పుడు 120కు పైగా దేశాలలో కో–కరిక్యులర్‌ యాక్టివిటీగా ఉంది. పురాతన కంప్యూటింగ్‌ ఉపకరణాన్ని చిన్నారులకు అత్యంత సన్నిహితంగా తీసుకురావడం కోసం దానికి డిజిటల్‌ రూపం ఇవ్వాలన్నది మా ఆలోచన. తద్వారా  అబాకస్‌ను తమ అరచేతిలోనే నేర్చుకునే అవకాశం కల్పించనున్నాం’’ అని ప్రసాద్‌ పీ, ప్రొడక్ట్‌ డిజైన్‌ స్పెషలిస్ట్‌, కో–ఫౌండర్‌, లెర్న్‌ క్లూ అన్నారు.

ఆగస్టు 2020లో ప్రసాద్‌, సతీష్‌ బాబు ప్రారంభించిన లెర్న్‌క్లూ లో పలు ఇతర మాడ్యుల్స్‌ను సైతం అనుసంధానించారు. దీనిలో నిరూపితమైన పురాతన మ్యాథమెటికల్‌ కంప్యూటింగ్‌, వేదిక్‌  మ్యాథ్స్‌, ఎక్స్‌ప్రెసివ్‌ ఇంగ్లీష్‌ సైతం భాగంగా ఉంటాయి.

తద్వారా సంజ్ఞలు, శరీర బాష, శైలి, వాయిస్‌ మాడ్యులేషన్‌, ఆడియో–వీడియో విజువల్స్‌, యాక్టివిటీ మరియు ప్రాక్టీస్‌ వర్క్‌షీట్స్‌,  అభ్యాస నిర్వహణ వ్యవస్థ మైస్కూల్‌ లైవ్‌ క్లాస్‌  వంటివి సైతం కలిగి ఉంటుంది.

మేథమేటికల్‌ సామర్థ్యం సైతం వృద్ధి చేస్తుంది

వీటి ద్వారా పాఠశాల మేనేజ్‌మెంట్లు వర్ట్యువల్‌ పాఠశాలలను సృష్టించడంతో పాటుగా నిర్వహించడం చేయడంతో పాటుగా ప్రత్యక్ష తరగతుల నిర్వహణ, అప్‌లోడ్‌ డిజిటల్‌ ఆడియో–వీడియో తరగతులు, ఆన్‌లైన్‌ హోమ్‌వర్క్‌ మరియు ఎసైన్‌మెంట్స్‌ నిర్వహించడంతో పాటుగా గ్రూప్‌ డిస్కషన్లు, పరీక్షలను  నిర్వహించడం, విద్యార్థుల నివేదికలు మొదలైనవి సైతం పొందవచ్చు.

‘‘లెర్న్‌క్లూ యొక్క డిజిటల్‌ అబాకస్‌ పనితీరు  భౌతిక పరికరం లాగానే ఉంటుంది. ఇది వాస్తవ సమయంలో బీడ్‌ కదలికల పరంగా మార్గనిర్దేశనం చేయడంతో పాటుగా అదే సమయంలో వారి కంప్యూటేషన్‌ టెక్నిక్స్‌ను సైతం ధృవీకరిస్తుంది. తద్వారా విద్యార్థుల మేథస్సు, ఆలోచనను మెరుగుపరచడంతో పాటుగా వారి మేథమేటికల్‌ సామర్థ్యం సైతం వృద్ధి చేస్తుంది. ఇది ప్రత్యక్ష మరియు రికార్డడ్‌ సదస్సులను నిష్ణాతుల నుంచి అందిస్తుంది’’ అని కో–ఫౌండర్‌, సతీష్‌ బాబు అన్నారు.

‘‘నాలుగు నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులను లక్ష్యంగా చేసుకున్న లెర్న్‌ క్లూ యొక్క ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ ఇప్పటికే 10000 డౌన్‌లోడ్స్‌ను తమ బీటా దశలోనే పొందింది. ఇది ఇప్పుడు 100% వృద్ధిని ప్రతి నెలా పొందుతుంది’’ అని ప్రసాద్‌ అన్నారు.

‘‘ప్రస్తుత మహమ్మారి ఇప్పుడు విద్యావ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్‌ అయ్యేందుకు తోడ్పడింది. మేము విప్లవాత్మక సాంకేతికతలను కంటెంట్‌ మొదలైనవి డిజిటలైజేషన్‌ చేసేందుకు తోడ్పడింది. అత్యున్నత ఆలోచనలను మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో  మేము  మా ఉత్పత్తులను రూపకల్పన చేశాము. ఈ నైపుణ్యాలు విద్యార్థులకు వారి జీవితంలో వివిధ దశలలో అత్యంత కీలకంగా ఉంటాయి’’ అని అన్నారు.

‘‘ఈ కంపెనీ ఇప్పుడు పలువురు ఏంజెల్‌ ఇన్వెస్టర్లతో 4.5 కోట్ల రూపాయల సమీకరణను తొలి దశ ఫండింగ్‌ చేసేందుకు చర్చలు జరుపుతుంది. ఇప్పటి నుంచి రెండు లేదా మూడు నెలల్లో ఈ నిధుల సమీకరణ కార్యక్రమం పూర్తి చేయగలమని భావిస్తున్నాం. విప్లవాత్మక సాంకేతికతలను స్వీకరించేందుకు ఈ మొత్తాలను వినియోగించడంతో పాటుగా లెర్న్‌ క్లూ యొక్క ఐఓఎస్‌ వెర్షన్‌ అభివృద్ధి చేయడం, భారతదేశ వ్యాప్తంగా విస్తరించడం మరియు ఈ–అభ్యాస రంగంలో సృజనాత్మక ఉత్పత్తులు అయిన అకడమిక్‌ సపోర్ట్‌, ఎక్స్‌పర్ట్‌టీచ్‌, పేరంట్‌ క్లూ మరియుస్కూల్‌ క్లూ ఆవిష్కరించనున్నాం’’అని పీ హరి చరణ్‌,సీఈఓ, లెర్న్‌ క్లూ అన్నారు.

ఎడ్‌ టెక్‌ మార్కెట్‌ ప్రస్తుతం 700 మిలియన్‌ డాలర్లు

ప్రసాద్‌ వెల్లడించే దాని  ప్రకారం, భారతీయ ఎడ్‌ టెక్‌ మార్కెట్‌ ప్రస్తుతం 700 మిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇది 2025 నాటికి 10 బిలియన్‌ డాలర్లుకు చేరుకోనుంది. ప్రధానంగా ఆన్‌లైన్‌ విద్య కోసం వేగంగా స్వీకరణ పెరగడమూ దీనికి తోడ్పడుతుంది.

‘‘బీ2సీ (బిజినెస్‌–టు– కన్స్యూమర్‌) విభాగం లో లెర్న్‌ క్లూ నిర్వహిస్తున్నారు. మేము మాతృసంస్థ, విశ్వమ్‌ యొక్క భారీ ఖాతాదారులు అయిన 10వేల పాఠశాలలు (దాదాపు రెండు మిలియన్ల మంది విద్యార్థులు)పై ఆధారపడటం ద్వారా దేశంలో తొమ్మిది రాష్ట్రాలలో విస్తరించాలనుకుంటున్నాం. దీనితో పాటుగా యుఎస్‌, కెనడాలలో సైతం విస్తరించడం ద్వారా భారీ ఆదాయం సమకూర్చుకోవాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం 23కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాలని లెర్న్‌ క్లూ లక్ష్యంగా చేసుకుంది. 2022నాటికి 82 కోట్ల రూపాయలకు దీనిని చేర్చాలని లక్ష్యంగా చేసుకున్నాం’’అని ప్రసాద్‌ అన్నారు.

Related posts

మాస్క్ ధరించని వారికి ఇక నుంచి జరిమానాలు

Satyam NEWS

కిరాతకంగా అత్యాచారం హత్య చేసినా ప్రశాంతంగా ఉరి

Satyam NEWS

పస్రా లో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

Satyam NEWS

Leave a Comment