33.7 C
Hyderabad
April 29, 2024 02: 31 AM
Slider సినిమా

కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం ను కలసిన లెహరాయి మూవీ నిర్మాత

#kollapurmla

లెహరాయి మూవీ నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.  సోమవారం అంకిరావుపల్లి గ్రామం లో కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి ని కలసి పూలమాల తో ఘనంగా సన్మానం చేశారు. 

రామకృష్ణ పరమహంస ను దర్శకుడిగా పరిచయం చేస్తూ మద్ది రెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లెహరాయి సినిమా షూటింగ్ పూర్తి అయిందని ఇప్పటికే రెండు అద్భుతమైన పాటలను విడుదల చేయడం జరిగిందన్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని ఆగస్టులో రిలీజ్ ఉంటుందన్నారు.  సినిమాలో ఏడు పాటలు ఉన్నాయన్నారు.  ప్రతి పాట ప్రేక్షకులను అలరిస్తాయన్నారు.

మంచి ఫీల్ గుడ్ కథ అన్నారు.  కొల్లాపూర్ పరిసరప్రాం తాలు సినిమా షూటింగ్ లకు చాలా అనువైన గా ఉన్నట్లు ఎమ్మెల్యేతో ఆయన తెలిపారు.  లెహరాయి సినిమా రిలీజ్ అనంతరం తీయబోయే నూతన సినిమా ని సైతం కొల్లాపూర్ ప్రాంతాలలో కొన్ని సీన్లను చేసేందుకు ఆసక్తి ఉన్నట్లు ఎమ్మెల్యే తో తెలిపారు.

ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో జరిగే  సినిమా షూటింగ్ లకు తమ సహకారం ఉంటుందన్నారు.

Related posts

ఆవిర్భావ సభ వేదికను పరిశీలించిన మెగా బ్రదర్

Sub Editor 2

రెడ్ హ్యాండెడ్: నలుగురు గుట్కా స్మగ్లర్ల అరెస్ట్

Satyam NEWS

వాహనదారులు తస్మాత్ జాగ్రత్త… రోడ్ రూల్స్ పాటించండి…

Satyam NEWS

Leave a Comment