26.7 C
Hyderabad
April 27, 2024 10: 29 AM
Slider ముఖ్యంశాలు

కొడుకును బతికించుకోవడానికి ఒక పోలీసు తండ్రి తపన

#Letter from a father

మిత్రులు, ఆప్తులు అందరికీ నమస్కారం

నా పేరు కిశోర్ రెడ్డి. నేను 2009 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ ను. నా స్వస్థలం లక్నరం గ్రామం, తెలకపల్లి మండలం. నా రెండో సంతానం ప్రేమన్విత్ రెడ్డి.

అతను పుట్టిన  45 రోజుల తరువాత అతనికి ఎర్ర రక్త కణాల ఉత్పత్తి లేనందుకు హిమోగ్లోబిన్ 2 % కు పడిపోయినది.  వెంటనే నేను హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ లో చూపించాను.

అతనికి పూర్ రెడ్  సెల్  అప్లసియా అనే వ్యాధి ఉందని డాక్టర్లు చెప్పారు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి లేదు కాబట్టి అప్పటి నుండి ప్రతి నెల బాబుకు రక్తం  ఎక్కిస్తున్నాను.

అతనికి ఇప్పటి వరకు సుమారుగా 65 సార్లు రక్తం ఎక్కించాము. అందువల్ల ఇప్పుడు శరీరంలో ఐరన్ మోతాదు  పెరిగింది. ఇలాగే ఇంకొక సంవత్సరం పాటు రక్తం  ఎక్కిస్తే అతని ప్రాణాలకే చాలా ప్రమాదం.

ఎక్కించక పోతే బాబు బ్రతకడు. దానికి పరిష్కారంగా బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ చికిత్స  తప్పనిసరిగా చేయించాలని డాక్టర్లు తెలిపారు. ఈ చికిత్స చేయించడానికి నాకు ఉద్యోగరిత్యా అవకాశం లేదు.

అదేవిధంగా గత 4 సంవత్సరాల నుండి నేను నా జీతం తో ప్రతి నెల 10,000/- ఖర్చు పెట్టి అతనికి రక్తం ఎక్కిస్తున్నాను. 

ఇప్పుడు BMT చికిత్స కు 20 లక్షల నుండి  30 లక్షల వరకు ఖర్చు అవుతుందని సికింద్రాబాద్ KIMS హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు.

బోన్ మ్యారో దాతలు లేకపోవడం వల్ల ఇన్ని సంవత్సరాలు ఆపరేషన్ చెయ్యలేదు. ఇప్పుడు డాక్టరు సలహా మేరకు మా అక్క స్టెమ్ సెల్స్ (Stem cells) ఆధారంగా హాఫ్ మ్యాచ్ ట్రాన్సప్లాంట్ చేస్తున్నారు.

నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంకా నేను ఖర్చు పెట్టలేక చివరగా నాకు మీ వంతు ఆర్థిక సహాయం చేస్తారని, నా కొడుకు ప్రాణ రక్షణకు అవసరమైన చికిత్స కోసం  మీ నుండి ఆర్థిక సహాయం కోరుచున్నాను. 

దయచేసి మీరందరు  పెద్దమనసుతో  నా కొడుకు చికిత్సకు మీకు తోచినంత  ఆర్థిక సహాయాన్ని   అందిస్తారని  ఆశిస్తున్నాను.

M.Kishore Reddy PC-2249, నాగర్ కర్నూల్ జిల్లా.

నా phone pay No- 7901154449,

బ్యాంక్ అకౌంట్ నెంబర్: M.Kishore Reddy, SBI No 33155524230, IFSC NO: SBIN0006648, Achampet Branch

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్, కొల్లాపూర్

Related posts

తిరుమల శ్రీవారి సేవలో బేతి , పన్నాల

Satyam NEWS

వనపర్తిని బంగారు పర్తిగా మరల్చాలి: సీఎం కేసీఆర్

Satyam NEWS

అమెరికాకు వెళ్లిన మంత్రి కేటీఆర్

Sub Editor 2

Leave a Comment