28.7 C
Hyderabad
April 27, 2024 05: 54 AM
Slider జాతీయం

దేశంలో మొట్టమొదటి సారిగా లైవ్ లో కోర్టు ప్రొసీడింగ్స్

#GujaratHighCourt

దేశంలో మొట్ట మొదటి సారిగా కోర్టు ప్రొసీడింగ్స్ యూ ట్యూబ్ ద్వారా లైవ్ టెలికాస్టు అయ్యాయి. గుజరాత్ హైకోర్టు చేసిన ఈ ప్రయోగానికి దేశవ్యాప్తంగా విపరీతమైన స్పందన వచ్చింది.

గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్ ఆధ్వర్యం లోని ఫస్ట్ కోర్టు ఈ ప్రయోగం చేసింది. బార్ సభ్యులు అందరూ కూడా ఈ లైవ్ కోర్టు ప్రొసీడింగ్స్ ను వీక్షించారు.

ఈ సారి దీన్ని కేవలం ప్రయోగాత్మకంగా మాత్రమే చేస్తున్నామని, తుది ఫలితం బేరీజు వేసుకున్న తర్వాత దీన్ని క్రమబద్ధీకరిస్తామని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

అందరు సభ్యులు పాల్గొనేందుకు వీలుగా లైవ్ ప్రొసీడింగ్స్ లింక్ ను ముందుగానే షేర్ చేశారు.

కోర్టు హియరింగ్స్ ను లైవ్ లో చూపించాలని సుప్రీంకోర్టు లో నడుస్తున్న స్వప్ననీల్ త్రిపాఠీ వర్సెస్ సుప్రీంకోర్టు కేసుకు సంబంధించి గుజరాత్ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది.

ముందుగా న్యాయమూర్తులతో కూడిన కమిటీ టెక్నికల్ విషయాలు పరిశీలించింది. నేడు కోర్టు ప్రొసీడింగ్స్ ను లైవ్ లో ప్రసారం చేశారు.

Related posts

సంస్కృతికి ఆనవాళ్లు

Satyam NEWS

పి వి నరసింహారావుపై కవితల పోటీ ఫలితాలు వెల్లడి

Sub Editor

భవిష్యత్తును భూతద్దంలో చూపిన దుబ్బాక ఫలితాలు

Satyam NEWS

Leave a Comment