18.7 C
Hyderabad
January 23, 2025 04: 01 AM
Slider ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు మద్యం పంచితే జైలుకే

jagan 28

అమరావతి లో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఏపీ అగ్రికల్చర్ కౌన్సిల్ ముసాయిదా బిల్లు కు క్యాబినెట్ ఆమోదం లభించింది. దీన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.

అందుకోసం మార్చి 15వ తేది కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. డబ్బు, మద్యం ప్రభావం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం   పంపిణీ చేసే అభ్యర్థులు దొరికితే వారిపై అనర్హత వేటు వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఎన్నికల నియమాలు ప్రకారం ఎవరైనా అభ్యర్థులు దొరికితే మూడు సంవత్సరాలు శిక్ష తో పాటు అనర్హత వేటు వేయాలని కూడా మంత్రి వర్గం అభిప్రాయపడింది. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచితే మూడు సంవత్సరాలు శిక్ష, అనర్హత వేటు వేయాలని అందుకు అనుగుణంగా చట్ట సవరణ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 13 రోజుల నుండి 15 రోజుల మార్చే చట్టానికి క్యాబినెట్ ఆమోదం లభించింది. ఎన్నికైన సర్పంచ్ ఖచ్చితంగా గ్రామాల్లో ఉండాలనే నిబంధన కూడా అమలు చేయబోతున్నారు.

Related posts

పట్టాలు తప్పిన ఇండోర్ జబల్ పూర్ ఎక్స్ ప్రెస్

Satyam NEWS

తొలగించిన ఓట్లను మరోసారి పరిశీలించాలి

mamatha

విద్యార్థులపై కుల వివక్ష చూపుతున్న ప్రిన్సిపాల్

mamatha

Leave a Comment