37.2 C
Hyderabad
April 26, 2024 19: 38 PM
Slider ముఖ్యంశాలు

లాక్ డౌన్ పాటించకపోతే అనాధ చావు గ్యారెంటీ

kollapur ci 16

లాక్ డౌన్ ను చాలా మంది తేలిగ్గా తీసుకుంటున్నారు. రోజంతా ఇంట్లో ఉండి పొద్దున్నే పాల పాకెట్ లు కూరగాయల కోసం మార్కెట్లో ఒకరి మీద ఒకరు పడి ఈరోజు కి ఏదో సాధించా అన్న ఫీలింగ్ తో ఇంటికి వెళుతున్నారు.  మీకు తెలియని విషయం ఏమిటంటే మీరు సాధించింది కరోనా ని.

అంతే మీరు సాధించింది కరోనాని మాత్రమే. మీరు  ఒకేసారి 21 రోజులకీ కావలసినవి తెచ్చుకోవాలి. ఆ తర్వాత బయట నుండి ఏమీ ఇంట్లో కి తీసుకురావద్దు.  లాక్ ద డోర్, తాళం మళ్ళీ 21 రోజులు తర్వాత తీయాలి. తాళం వేసిన 4 వ రోజు వరకు మీ కుటుంబం లో ఎవరికీ దగ్గు, జలుబు,  జ్వరం లేకపోతే మీ కుటుంబం 50% సేఫ్.

14వ రోజు వరకు రాకపోతే మీ కుటుంబం 90% సేఫ్,  29వ రోజు వరకు ఏ లక్షణాలు కనపడకపోతే మీరు మీ కుటుంబం 100% సేఫ్. మధ్యలో ఒక్క రోజు బయటకు వెళ్ళినా, బయట వస్తువు ఇంట్లో కి తెచ్చినా అప్పటి నుండి మళ్ళీ 29 రోజుల లాక్ డౌన్ కొనసాగుతుంది.

కరోనా చివరి పేషెంట్ ఐసొలేట్ అయిన తర్వాత 29 రోజుల వరకు  లాక్ డౌన్ కొనసాగుతుంది. అందరూ సహకరిస్తే నే తొందరగా దేశంలో నార్మల్ లైఫ్ వస్తుంది. సగటున కరోనా ఎటాక్ అయిన 4వ రోజు  జ్వరం,  7వ రోజు ఊపిరితిత్తుల ఫెయిల్ తో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది.

వెంటనే వెంటిలేటర్స్ పెట్టకపోతే రక్తం లో ఆక్సిజన్ అందక యాంటీబాడీస్ పెరిగి 10వ రోజుకల్లా కిడ్నీ లు ఫెయిల్ అవుతాయి.  అలా మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ తో అనాధ చావు చనిపోతారు. మన రాష్ట్రంలో 350 ,పంజాబ్ లో 290, డిల్లీలో 800 మాత్రమే వెంటిలేటర్స్ ఉన్నాయి.

దేశంలో ఎన్ని ఉంటాయో అంచనా వేయండి. లేకపోతే CDDEP వారి  అంచనా ప్రకారం 25 కోట్ల మంది కి ఏప్రిల్ నెల మధ్య నాటికి కరోనా సోకుతుంది,  అందులో మీరు ఉంటారా? , ఇంట్లోనే ఉంటారా? మీరు, మీ కుటుంబ సభ్యులు ఎంత safe గా ఉన్నారో లేక ఎంత risk లో ఉన్నారో చూసుకోండి.

సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ

Related posts

ఆ మూడుగంట‌లు ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద ట్రాపిక్ క్లియ‌ర్…..!

Satyam NEWS

కారణం చెప్పి.. రామన్న కంటతడి

Satyam NEWS

సొంత ఇంట్లోనే తల్లీకూతుళ్ల దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment