40.2 C
Hyderabad
April 29, 2024 16: 52 PM
Slider కర్నూలు

శ్రీశైలంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

#rkroja

శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన   జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను సోమవారం టూరిజం, క్రీడలు శాఖ మంత్రి ఆర్కే రోజా, స్థానిక శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి  తో కలసి వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని అన్నారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఆమె అన్నారు. అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరి జీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని, జయంతిని, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. వాసవి సత్ర సముదాయల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహాత్మా గాంధీ, రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులనిఅన్నారు.

అలాంటి మహనీయుల దేశానికి చేసిన నిస్వార్థ సేవ వల్లే మనం ఈరోజు ఇలా స్వతంత్రంగా ఉన్నామని అన్నారు. శ్రీశైలం కు కేంద్ర నిధుల తోటి  టూరిజం హబ్ గా ఏర్పాటు చేయాలని మంత్రి రోజాకు సూచించారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సత్రం అధ్యక్షులు ఒగ్గు శ్రీనివాసులు, శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ మర్చంట్ అసోసియేషన్  కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

డొంకతిరుగుడు అప్పులకు లెక్క చెప్పని జగన్ ప్రభుత్వం

Satyam NEWS

బూస్టర్ డోసుపై మారటోరియం.. దేశాలకు డబ్ల్యూహెచ్ఓ సూచన

Sub Editor

టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో జాతీయ జెండాకు వందనం

Satyam NEWS

Leave a Comment