34.3 C
Hyderabad
April 16, 2021 14: 09 PM
Slider కరీంనగర్

మంచిర్యాల నుండి మంథని మీదుగా వరంగల్ కు నేషనల్ హైవే

#D.SridharbabuMLA

మంచిర్యాల నుండి జైపూర్ మండలం మీదుగా వేలాల  నుండి మంథని నియోజకవర్గంలోని పలు గ్రామాలను కలుపుతూ వరంగల్ వరకు నేషనల్ హైవే ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని మాజీ మంత్రి, మంథని నియోజకవర్గ శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

మంథని మండలంలోని పోతారం గ్రామం నుండి – విలోచన వరం గ్రామం – నాగారం గ్రామం – కన్నల గ్రామం –  పందుల పల్లి గ్రామం – పుట్టపాక గ్రామం – రామగిరి మండలం రామయ్యాపల్లి గ్రామం నుండి- ఆదివారం పేట గ్రామం – బేగం పేట గ్రామం- నవాబ్ పేట గ్రామం – ముత్తారం మండలం  లక్కారం గ్రామం – కేశనపల్లి గ్రామం – ముత్తారం గ్రామం – అడవి శ్రీరాంపూర్ గ్రామం – ఒడేడు మీదుగా వరంగల్ వరకు నేషనల్ హైవే ఉంటుందని ఆయన వివరించారు.

ఈ నేషనల్ హైవే రోడ్ ఎలాంటి పాత రోడ్లకు సంబంధం లేకుండా నూతన రోడ్డు లైన్స్ తో  మంచిర్యాల నుండి మంథని మీదుగా వరంగల్ వరకు నేషనల్ హైవే మంజూరు సహకరించిన  కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి సహకరించిన  అధికారులు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మంథని నియోజకవర్గ ప్రజలు వరంగల్ కు తొందరగా చేరడానికి ఈ మార్గం అతి తొందర్లో అందుబాటులో వస్తుందని కోరుకుంటున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.

Related posts

Analysis: యువత మనసు ఎరగని ‘మన్ కి బాత్’

Satyam NEWS

య‌థార్ధ ఘ‌ట‌న ఆధారంగా మూడు భాష‌ల్లో `స‌మిధ`

Sub Editor

కరోనాపై పోరాటానికి శ్రీచైతన్య విరాళం రూ.కోటి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!