తెలంగాణ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి తమకు చెందిన వ్యక్తులకు అప్పగించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడ నిర్ణయాల వల్ల ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెందుతోందని ఆయన అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడకు పోతే గత చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు.ఆర్టీసీ సమ్మె మొదటి రోజు నుంచే ఎమ్మార్పీఎస్ మద్దతు ఉందని, ఆర్టీసీ డిమాండ్లు పూర్తి అయ్యే వరకు తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు డిమాండ్లు అన్ని న్యాయబద్ధమైనవని, ఆర్టీసీని ప్రభుత్వం విలీనంలో చేసే వరకు పోరాటం కొనసాగించాలని మంద కృష్ణమాదిగ అన్నారు
previous post