30.7 C
Hyderabad
April 29, 2024 05: 46 AM
Slider కరీంనగర్

మానేరు రివర్ ఫ్రంట్ పై వేగంగా ప్రభుత్వ చర్యలు

#ministergangula

కరీంనగర్ అభివృద్ధిపై నిరంతరం తపన పడే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ప్రపంచస్థాయి పర్యాటక ప్రాజెక్టైన మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో తీసుకొంటున్న చొరవతో అత్యంత వేగంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ రివర్ బెడ్ కు సంబందించిన పనులు చేస్తుండగా, ప్రాజెక్ట్ లో బాగంగా చేపట్టిన తీగల వంతెన ప్రారంభానికి సిద్దమైంది, మరోవైపు చెక్ డాంల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

వీటితో పాటు ప్రాజెక్టులో ప్రధానమైన రిటైనింగ్ వాల్ తుది డిజైన్, టూరిజం ఏర్పాట్లపై  ఈ రోజు మంత్రి గంగుల కమలాకర్ టూరిజం, ఇరిగేషన్, డిజైనింగ్ ఏజెన్సీ ఉన్నతాధికారులతో హైదరాబాద్ లోని టూరిజం ప్లాజాలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు డీపీఆర్ సమగ్ర వివరాలు అడిగి తెలుసుకున్నారు, మానేరు రివర్ ప్రంట్లో చేయాల్సిన పనులపై అధికారులకు ఆదేశాలు జారీచేసారు, అతి త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసుకొని టెండర్లు పిలుస్తామని మంత్రికి అధికారులు వివరించారు.

మరోవైపు ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కోసం అనుసరించాల్సిన విధానాలపై రెవెన్యూ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేసారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ అభివ్రుద్ది కోసం ప్రత్యేక శ్రద్ద కనబరుస్తారని, అందుకోసం ఇప్పటికే మానేరు రివర్ ఫ్రంట్ వివిద పనుల కోసం దాదాపు 600 కోట్లను కేటాయించారన్నారు. అదే స్పూర్తితో అందరం పనిచేయాలని, కరీనగర్ని, తెలంగాణ టూరిజాన్ని, దేశానికే ఆధర్శంగా తీర్చిదిద్దాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.

ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాసరాజు, ఇరిగేషన్ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజం కార్పోరేషన్ ఎండి మనోహర్ రావు, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ డా. యాదగిరిరావు, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్,  కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, డిజైనింగ్ ఏజెన్సీ ప్రతినిదులు ఇతర రాష్ట్ర, కరీంనగర్ జిల్లా ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ, మున్సిపల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

29న ఖమ్మంలో భారీ సభ

Murali Krishna

సెప్టెంబరు 18 నుండి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

తెలంగాణ విద్యావ్యవస్థపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Bhavani

Leave a Comment