40.2 C
Hyderabad
April 29, 2024 16: 51 PM
Slider ఆదిలాబాద్

జొన్న రైతులతో అధికారుల చెలగాటం

#Adilabad BJP

ఆరుగాలం కష్టపడి పండించిన జొన్న పంటను కొనుగోలు చేసిన మార్క్ ఫెడ్ అధికారులు కనీసం  రైతులకు తక్ పట్టి ఇవ్వకపోవడంపై బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మండిపడ్డారు. సోమవారం అనుకుంట గ్రామానికి వెళ్లి జొన్న రైతులు పడుతున్న కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు.

మార్క్ ఫెడ్ ద్వారా అనుకుంట గ్రామంలో జొన్నలు కొనుగోలు చేస్తున్నప్పటికీ రైతులకు సంబంధించి తక్ పట్టి(రసీదు) ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకుంట, యాపాల్గూడ  కచ్కంటి వివిధ గ్రామాల నుండి రైతులు జొన్నలు తీసుకువచ్చి అమ్ముకుంటే కనీసం ధర ఇవ్వని అధికారులు రసీదులు కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.

వారం పది రోజులుగా రైతులు అనుకుంట లో మకాం వేసి పడిగాపులు కాస్తున్నారని అధికారులు మాత్రం తూకం వేసి బాధ్యతలు విస్మరించారని విమర్శించారు. కందులు శనగలు కొనుగోళ్లలో తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం జొన్నలు పండించిన రైతులను కూడా ఇక్కట్లకు గురి చేయడం దారుణమన్నారు.

వర్షం పడితే జొన్నలు తడిసి ముద్దై అవకాశముందని శంకర్ పేర్కొన్నారు.. అనంతరం మార్క్ ఫెడ్  డీఎం పుల్లయ్య తో సహకార సంఘం అధికారులతో మాట్లాడి వెంటనే రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  లేనట్లయితే రైతులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో వెంటనే దిగి వచ్చిన అధికారులు వివిధ గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించి తక్ పట్టిలు అందజేశారు. డబ్బులు కూడా వెంటనే అందించాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనుకుంటా కౌన్సిలర్ శ్రీనివాస్, కేశవ్ బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Related posts

మక్తల్ కాంగ్రెస్ సభ్యత్వం ఇన్ చార్జిగా రంగినేని

Satyam NEWS

నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్

Satyam NEWS

ఓ హెచ్.సిని ప్రశంసించిన విశాఖ రేంజ్ డీఐజీ!

Sub Editor

Leave a Comment