26.7 C
Hyderabad
April 27, 2024 07: 07 AM
Slider ప్రపంచం

కిరాణా షాపులో వయోవృద్ధుల వివాహం

#marriage

సాధారణంగా అందరూ ఎక్కడ పెళ్లి చేసుకుంటారు? హోటల్, కళ్యాణ మండపం లేదా ఆలయం. అయితే అమెరికాలో ఓ జంట కిరాణా దుకాణంలో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అరిజోనాకు చెందిన డెన్నిస్ డెల్గాడో (78), బ్రెండా విలియమ్స్ (72) ఒక కిరాణా దుకాణంలో వివాహం చేసుకున్నారు. అసలే వయసు మీరిన వారు… పెళ్లి కిరాణా దుకాణంలో.. మరింకేం ఈ వీడియో వైరల్ అయింది.

ఈ వయోవృద్ధులు ఇద్దరూ ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి కారణం ఉందట. గతేడాది ఇదే స్థలంలో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. కాసా గ్రాండేలోని ఫ్రైస్ ఫుడ్ అండ్ డ్రగ్ స్టోర్‌ అది. వారు ఆ సూపర్ మార్కెట్‌లో కలుసుకున్న వెంటనే డేటింగ్ ప్రారంభించారు. వారు తమ మనోభావాలను పంచుకోవడానికి ఈ సూపర్ మార్కెట్ నే ఎంచుకున్నారు. బ్రెండా తాను డెన్నిస్‌ను మొదటిసారి కలిసిన రోజును గుర్తుచేసుకుంది.

‘నేను కారిడార్‌లో నడుస్తున్నాను. నా వెనుక ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు… “మాస్క్ ధరించడం గురించి మీకు తెలుసా? అని అతను అడిగాడు. బ్రెండా ఆ తర్వాత కాసేపు అక్కడే నిల్చున్నది. అతనితో మాట్లాడింది. ఆ తర్వాత ఈ జంట తమ మొబైల్ నంబర్‌లను మార్పిడి చేసుకోవడానికి ఎక్కువసేపు వేచి ఉండలేదు. తద్వారా తమ ప్రేమ కథను ప్రారంభించామని వెల్లడించారు.

నెలల తరబడి డేటింగ్ తర్వాత, ఈ ఏడాది ఏప్రిల్‌లో డెన్నిస్ బ్రెండా ఇంటికి వచ్చి ఆమె కోసం ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని అందచేశాడు. ఇంక ఆలస్యం చేయకుండా, బ్రెండా ఆఫర్‌ను అంగీకరించింది. బ్రెండాకు పెళ్లయి మూడు దశాబ్దాలు అయింది. తర్వాత ఆమె భర్త చనిపోయాడు. డెన్నిస్ కు కూడా భార్య చనిపోయింది.

Related posts

స్కానింగుల పేరుతో ఆస్పత్రుల్లో దోపిడీ

Satyam NEWS

ఈ బాబుకేమైంది? ఎందుకు మాట్లాడటం లేదు?

Satyam NEWS

ఫలించిన శాసనసభ్యుని ప్రయత్నం:తీరిన ఆయకట్టు రైతుల కష్టాలు

Satyam NEWS

Leave a Comment