Slider ఆంధ్రప్రదేశ్

ఎమ్మార్వో సమక్షంలోనే డబ్బుల కోసం తన్నుకున్న వీఆర్వోలు

MRO

కర్నూలు జిల్లాలో ఇద్దరు వీర్వోల మధ్య తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. డబ్బుల పంపకాల్లో ఏర్పడ్డ గొడవలో ఇద్దరు వీఆర్వోలు ఎమ్మార్వో సమక్షంలోనే తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలయ్యాయి. కాగా, గొడవ జరుగుతున్న సమయంలో ఒక వీఆర్వో చెవిని మరో వీఆర్వో కొరికాడు. సుంకేసుల వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, జోహారాపురం వీఆర్వో కృష్ణదేవరాయ మధ్య డబ్బుల విషయంలో గొడవ తలెత్తింది. కర్నూలు నగరంలోని ఎమ్మార్వో కార్యాలయంలో ఇద్దరు వీఆర్వోలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో గాయాలపాయ్యారు. గొడవ పడుతున్న సమయంలో తనను డబ్బు కోసం వేధిస్తున్నాడంటూ వీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి చెవి కొరికారు వీఆర్వో కృష్ణదేవరాయ. అక్కడే ఉన్న ఎమ్మార్వో ఇద్దరి మధ్య రాజీకి ప్రయత్నించారు. కొంత సమయానికి ఇద్దరూ శాంతించడంతో ఎమ్మార్వో సహా అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

సిఎంపై అనుచిత పోస్టింగులు చేసిన అధికారి అరెస్టు

Satyam NEWS

నిరుపేదలకు సాయం అందించడమే సర్వర్ చారిటబుల్ ట్రస్టు ధ్యేయం

Satyam NEWS

సైబర్ సేఫ్టీ పై జాన్సన్ గ్రామర్ స్కూల్ లో వర్క్ షాప్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!