28.7 C
Hyderabad
April 26, 2024 08: 21 AM
Slider నల్గొండ

మేళ్లచెర్వు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా

#MLASanampudiSaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెర్వు మండల కేంద్రంలో శనివారం కళ్యాణ లక్ష్మి  చెక్కులను, బతుకమ్మ చీరలను శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పంచిపెట్టారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి  మాట్లాడుతూ  వారం రోజుల వ్యవధిలో నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 7 కోట్ల రూపాయల కళ్యాణలక్ష్మి, షాదీ ముభారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశామని అన్నారు.

రెవిన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయడానికి కొత్త రెవిన్యూ చట్టం తీసుకురావడం జరిగిందని, దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వ టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వమే అని అన్నారు.

మేళ్లచెర్వు మండల కేంద్రంలోని  స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ప్రత్యేక దేవాలయంగా తీర్చిదిద్దుతానని అన్నారు.

మేళ్లచెర్వు మండల కేంద్రంలో గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణం త్వరలో జరుగుతున్నదని, రెండు మూడు నెలల్లో మిషన్ భగీరధ నీళ్ళు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు.

మండల కేంద్రంలో DMFT నిధుల ద్వారా విడుదలైన సుమారు 5 లక్షల రూపాయల విలువ గల సి‌సి రోడ్డు నిర్మాణానికి  శంఖుస్థాపన చేశారు.

మండల కేంద్రంలో 60 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎం‌పి‌పి,  సర్పంచ్ పందిరిపల్లి శంకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు సూరిశెట్టి బసవయ్య,  ప్రధాన కార్యదర్శి బేత  వీరనాగిరెడ్డి, జిల్లా కొ-ఆప్షన్ సభ్యులు ఇమ్రాన్ ,మండల యూత్ అధ్యక్షుడు సాతులూరి సురేష్, MRO, ఎం‌పి‌డి‌ఓ, ఈవో తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాఠశాలల్లో మిషన్ భగీరథ వాటర్ ఏర్పాటు చేయాలి: SFI

Satyam NEWS

CTC అడిషనల్ డీసీపీ గా బాధ్యతలు స్వీకరించిన LC నాయక్

Satyam NEWS

బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి

Satyam NEWS

Leave a Comment