35.2 C
Hyderabad
April 27, 2024 13: 26 PM
Slider విజయనగరం

బకాయి జీతాలు, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

#middaymeals

ఏ. పి. మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం ( ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో పాఠశాలల్లో పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనాలు వండి, వడ్డించే నిర్వహుకుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా నాయకులు డేగల అప్పలరాజు, పురం అప్పారావు ల నేతృత్వంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. 

గత  ఇరవై ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎన్నో ఆటంకాలు అధిగమించి విజయవంతంగా పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ, సంవత్సరాల తరబడి గొడ్డుచాకిరీ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం కనీస వేతనాలు పెంచకుండా, గుర్తింపు కార్డులు మంజూరు చేయకుండా, పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కల్పించకుండా, మధ్యాహ్న భోజన నిర్వాహకులను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదన్నారని నేతలంతా ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ మేరకు ధర్నా ఉద్దేశించి ఏ ఐ టి యు సి సీనియర్ నాయకులు పి.కామేశ్వరరావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏ ఐ టి యు సి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తోందన్నారు.అందులో భాగంగానే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికై చలో కలెక్టరేట్  నిర్వహించామన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మూకుమ్మడి దాడి ఇది

ఈ సందర్భంగా ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మూకుమ్మడిగా ఆర్ధిక దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. వంట గ్యాస్, వంట నూనె, కోడిగుడ్లు, కూరగాయల మొదలైన నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నా విద్యార్థులకు మెనూ ప్రకారం చెల్లించాల్సిన ధరలను ప్రభుత్వ చెల్లించకుండా  కాలయాపన చేయడం వలన మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇంట్లో ఉన్న వస్తువులను అమ్ముతూ వడ్డీ వ్యాపారుల వలలో చిక్కి ఎన్నో అవస్థలకు గురవుతున్నా మీకు ఎందుకు చలనం కలగడం లేదని ప్రశ్నించారు.

మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్న నిర్వాహకుల కుటుంబంలో ప్రశాంతత కోల్పోతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం అత్యంత దుర్మర్గం అని అశోక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు టి జీవన్ మాట్లాడుతూ ప్రభుత్వం బిల్లులు చెల్లించక కిరాణా షాపు దగ్గర అప్పు కొండంత పెరిగి పెరగడంతో తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు, ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిర్వాహకులు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారని అన్నారు.

దానికి తోడు గ్రామాల్లో రాజకీయ నాయకుల నుండి వస్తున్న వేధింపులు తాళలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం సకాలంలో ఆదుకోలేక పోతుంది, ఎన్నికల హామీల  అమలులో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చ కాకపోవడంతో కార్మికులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు.

మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలి

మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు సంస్థలైన ఇస్కాన్, అక్షయపాత్ర, నాంది, మరియు అనేక ఇతర ట్రస్టుకు అప్పగించేందుకు అనేకమైన జీవోలు జారీ చేసినప్పటికీ ఏఐటియుసి చొరవచూపి పథకాన్ని ప్రైవేటు సంస్థలకు వెళ్లకుండా పోరాడింది,మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలోని పోరాడాలన్నారు. 

ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. రంగరాజు మాట్లాడుతూ బకాయి పడ్డ జీతాలు, పెండింగులో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి, కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలి, మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న అందరికీ వెంటనే జీతాలు వేయాలని, 9 ,10 తరగతులకు సంబంధించి పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే వేయాలని, తదితర డిమాండ్లు పరిష్కరించాలని తెలిపారు.

సమస్యలు పరిష్కారం చేయలేని ఎడల రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న నిర్వహకులందరినీ కూడగట్టి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎస్.కోట, గజపతినగరం నియోజకవర్గ ఉన్న నిర్వహకులు పెద్దఎత్తున హాజరయ్యారు.

Related posts

మత మార్పిడులను సహించేది లేదు

Satyam NEWS

ఫ్యామిలీ డాక్టర్ విధానం: ఊరూరా ఆధునిక వైద్యం

Satyam NEWS

యాదాద్రి శ్రీ‌ ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి ని ద‌ర్శించుకున్న మంత్రి ఎర్ర‌బెల్లి

Satyam NEWS

Leave a Comment