33.7 C
Hyderabad
April 28, 2024 23: 18 PM
Slider ప్రత్యేకం

వెల్లివిరిసిన మతసామరస్యం: మిలాద్ నబీ రోజునే సిరిమాను సంబరం

#sirimanujatara

దైవం ముందు అందరూ సమానులే అని నిరూపించిన విజయనగరం ప్రజలు…!

ఉత్తరాంధ్ర లోని విజయనగరం లో అమ్మ వారి సిరిమాను సందర్భంగా మతసామరస్యం వెల్లివిరిసింది. అమ్మవారి సిరిమాను రోజునే ముస్లింల పండగ మిలాద్ నబీ రావడం జరిగింది. ఈ క్రమంలో నే నగరంలో ఓ వైపు మూడులాంతర్ల వద్ద పైడతల్లి దేవాలయం లో సిరిమాను సంబరం జరుగుతుండగా మరోవైపు అంబటి సత్రం వద్ద ఉన్న మసీదు నుంచీ మిలాద్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులు ఊరేగింపు బయలు దేరింది.

19 వ తేదీనే రెండు పండుగలు రావడంతో పోలీసులు దాదాపు 2,500 మంది బందోబస్తు తో పాటు పాల్కన్ మొబైల్ రాండ్ కెమారాను అమర్చారు. సరిగ్గా ఉదయం ప్రార్ధనలు అనంతరం ముస్లిం సోదరులు ఊరేగింపుగా అంబటి సత్రం వద్ద మలుపు నుంచీ ఆబాద్ వీధి వరకు కొనసాగింది.ఎక్కడా నినాదాలు లేకుండా… ప్రశాంతంగా ముస్లిం ల ఊరేగింపు పూర్తయింది. టూటౌన్ సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ సమక్షంలో బందోబస్తు నిర్వహించారు.

Related posts

రూ. 29 కోట్ల ఖరీదు చేసే బంగారం, డ్రగ్స్‌ పట్టివేత

Sub Editor

నాగ్ పూర్ లో 21వ తేదీ వరకూ సంపూర్ణ లాక్ డౌన్

Satyam NEWS

బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు గిరిజన ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Satyam NEWS

Leave a Comment