29.7 C
Hyderabad
April 29, 2024 09: 40 AM
Slider ముఖ్యంశాలు

మినీ మేడారం జాతరకు సకల సౌకర్యాలు

#MadaramJatara

ఈ నెల 24 నుంచి 27 వరకు జరిగే మేడారం మినీ జాతర కు సకల సౌకర్యాలు  చేయనున్నట్లు ములుగు జిల్లా రెవెన్యూ అధికారి కే రమాదేవి వెల్లడించారు.

సోమవారం మేడారం సందర్శించి జంపన్నవాగులో జరుగుతున్న ఇసుక లెవలింగ్ పనులను, స్థానిక తాసిల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్ తో కలిసి ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం మినీ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

వైద్య సేవలు, తాగునీరు, పారిశుద్ధ్య పనులు, నిరంతర విద్యుత్ వెలుగులు తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.

మనీ మేడారం జాతర సమయంలో  24 గంటలు వైద్య సేవలు అందించాలని ములుగు జిల్లా వైద్యాధికారిని కోరామని ఆమె తెలిపారు.

ఇలాంటి ఇబ్బందులు లేకుండా వన దేవతల దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్లేలా అన్ని చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

మినీ మేడారం వనదేవతల దర్శనానికి సుమారు పది లక్షల మంది వస్తారని, పెరిగే భక్తుల సౌకర్యార్ధం,  సౌకర్యాలు  సరిపోయే విధంగా సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ ముల్కనూరు శ్రీనివాస్, వీఆర్వో బొప్ప సమ్మయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కే.మహేందర్ గౌడ్, సత్యం న్యూస్

Related posts

జామి సురేశ్ కిడ్నాప్ రహస్యం ఛేదించిన పోలీసులు

Satyam NEWS

పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆశీర్వాదం తీసుకున్న విజయనగరం కొత్త క‌లెక్ట‌ర్

Satyam NEWS

ఇబ్రహీంపట్నం సబ్ స్టేషన్ ముట్టడించిన కోమటిరెడ్డి

Satyam NEWS

Leave a Comment