29.7 C
Hyderabad
April 29, 2024 08: 51 AM
Slider ఆదిలాబాద్

మంత్రి అల్లోలకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ ప్రసాదం

Minister Allola

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానం ఆలయ పూజరులు ఆశీర్వచనాలు అందచేశారు. నేడు మంత్రి పుట్టిన రోజు సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రి జన్మదినం సందర్భంగా అమ్మవారి ఆలయంలో కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి ఆలయ పూజరులతో ప్రత్యేక పూజా చేయించారు. అమ్మవారు వారికి అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షుని ఇవ్వాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధానార్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు నందకిశోర్, ఆలయ ఇవో వినోద్ రెడ్డి నిర్మల్ లో మంత్రిని కలసి అమ్మవారి ప్రసాదం అందించారు.

ఆలయ పూజారులు ఆశీర్వచనం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి వెంబడి ఆలయ సిబ్బంది శంకర్ శర్మ, ఆలయ P.R.O గోపాల్ సింగ్, ఆలయ AE రామారావు, అడేల్లి ఆలయ ఇవో ఉన్నారు.

Related posts

ఏఐసీసీలో భారీ ప్రక్షాళన

Sub Editor 2

ఒక్క రోజులో హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

Bhavani

కార్మికుల శ్రమను గౌరవిద్దాం

Satyam NEWS

Leave a Comment