30.7 C
Hyderabad
April 29, 2024 06: 02 AM
Slider విజయనగరం

చీపురుపల్లి అభివృద్ధి పై మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు బాధ్యత లేదా…?

#nagarajuTDP

కొత్త జిల్లాలు ఆవిర్బావం అవుతున్న వేళ‌…అత్య‌ధిక జ‌న‌భా క‌లిగిన చీపురుప‌ల్లిని ప్ర‌త్యేక రెవిన్యూ డివిజ‌న్ గా  ఎందుకు  ఏర్పాటు చేయ‌డం లేదంటూ ఏపీలోని విజ‌య‌న‌గ‌రం  జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్ర‌శ్నించారు. అస‌లు చీపురుప‌ల్లిని  అభివృద్ది చేద్దాంఅన్న బాధ్య‌త మీకు ఉందా లేదా అంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని అలాగే నియోజ‌క‌పు వ‌ర్గ  ఎమ్మెల్యే,మంత్రి అయిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను ప్ర‌శ్నించారు.చీపురుపల్లిలో  రెవెన్యూ డివిజన్ ఏర్పాటు పై మంత్రి బొత్సా అభిప్రాయం చెప్పాలని  డిమాండ్ చేశారు.

రెవెన్యూ డివిజన్ కోసం    చీపురుపల్లి ప్రజలు పోరాటాలు చేస్తున్నారన్నారు. అస్స‌లు స్థానిక ఎమ్మెల్యే  ,మంత్రి బొత్స‌కు   చీపురుపల్లి ప్రజలఆకాంక్షలు తెలుసా, తెలీదా అని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా  చీపురుపల్లి లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారా ,చేయరా అని ప్రజలకు అభిప్రాయాలను తెలియజేసే బాధ్యత మీపై ఉంది అన్నారు.టీడీపి కార్యకర్తల సంక్షేమ పథకాలు నిలుపుదల చేయటం లాంటి దిక్కుమాలిన రాజకీయాలు మాని,అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో మద్యపానం నిషేధం హామీ ఇచ్చి ,గెలిచాక సామాన్యడుకు అందుబాటులో లేని విధంగా మద్యం రేట్లును పెంచి,సామాన్య ప్రజలును కల్తీ మద్యంనకు అలవాటు చేసి, వారి హాత్యలుకు కారణం అయ్యార‌ని ఆరోపించారు.అస్స‌లు  మీ వాళ్లే గ్రామాలల్లో మద్యం పాటలు నిర్వహించి, బెల్ట్ షాపులు నడుపుతున్నార‌ని కూడా ఆరోపించారు.ఈ నేప‌ధ్యంలో ఎక్సైజ్ అధికారులు గ్రామంలో బెల్టుషాపులు అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని నాగార్జున‌ డిమాండ్ చేశారు.

Related posts

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి అపచారం

Satyam NEWS

సమగ్ర శిక్ష ఉద్యోగుల భిక్షాటన

Satyam NEWS

Leave a Comment