37.2 C
Hyderabad
April 26, 2024 21: 52 PM
Slider హైదరాబాద్

హెచ్ఎండీఏ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో జరుగుతున్న మౌలికవసతులు, అభివృద్ది పనులు, ఇతర కార్యక్రమాలను పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు శనివారం సమీక్షించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ మరియు ఉన్నత అధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ ఈ సమీక్ష సమావేశాన్ని బుద్ధ భవన్ జిహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ చేపట్టిన మౌలికవసతుల కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు యుద్ధప్రాతిపదికన చేయాలని సూచించారు.

టిఎస్ బి పాస్ చట్టం వచ్చిన తర్వాత హెచ్ఎండిఎ లో జరగబోయే మార్పులకు సంబంధించి ఇప్పటి నుంచి సంసిద్ధంగా ఉండాలని మంత్రి కేటిఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా హెచ్ఎండిఏ రానున్న కాలంలో ప్లానింగ్, విజనింగ్, డిజైనింగ్ వంటి అంశాలపై మరింత దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అందుకు ఇప్పటినుంచే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించిన చర్చ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు పైన చేపడుతున్న మౌలిక వసతుల కార్యక్రమాలకు సంబంధించి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉన్న బఫర్ జోన్ లో వచ్చిన నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

ఈ విషయంలో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ విస్తరించి ఉన్న జిల్లాల కలెక్టర్ల సహకారాన్ని ఈ విషయంలో తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు వెంట పబ్లిక్ ఎమినిటీస్ గ్రాండ్ గా ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. అందులో భాగంగా వెంట పెట్రోల్ బంకులు, ఫుడ్ కోర్టులు, రెస్ట్ ఏరియాలు, గేట్ వే నిర్మాణాలు పి.పి.పి మోడల్ లో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను నిర్దేశించారు. బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను నవంబర్ చివరి నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి తరహాలో అసెట్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ విషయంలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ పైన హెచ్ఎండీఏ ప్రస్తుతం కొనసాగిస్తున్న గ్రీనరీ కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, హెచ్ఎండిఎ అధికారులను గ్రీనరీ విషయంలో అభినందించారు.

హెచ్ఎండిఎ నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, మెహదీపట్నం, ఉప్పల్ స్కై వే లను కూడా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల సంరక్షణ కోసం తీసుకుంటున్న కార్యకలాపాల పైన మంత్రి కేటీఆర్ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు సంబంధించిన వివరాలను కూడా మంత్రి కేటీఆర్ కి అధికారులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి జంటనగరాలకు అనుసంధానంగా ఉన్న ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు గొప్పగా ఉండాలని సంబంధిత ఇంజనీరింగ్ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి హెచ్ఎండిఎ సెక్రెటరీ సంతోష్ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ శరత్ చంద్ర, ఎస్టేట్ ఆఫీసర్ ప్రసునాంభ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బొలెరో కారు లారీ ఢీ: ముగ్గురి మృతి

Bhavani

పిల్లలపై లైంగిక వేధింపులపై 14 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

Sub Editor

కుల, మత సామరస్యానికి ప్రతీక బిఆర్ యస్

Satyam NEWS

Leave a Comment