సర్ప రూపంలో సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వల్ల అందరికీ మేలు జరుగుతుందని, అందరూ సుఖంగా ఉండాలని సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. అంకమ్మ గుడి రామవరపాడు వద్ద మణికంఠ భక్తబృందం ఆధ్వర్యంలో సుబ్రమణ్య స్వామి షష్టి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం బాబా గురుస్వామి ఆధ్వర్యంలో విమాన కావడి మహోత్సవం, హోమగుండం కన్నుల పండుగ గా జరిగింది. అనంతరం సాధు జాన్ వీధి సొరంగం కొండపైన జరిగిన సుబ్రహ్మణ్యస్వామి పూజా కార్యక్రమం కార్యక్రమంలో మంత్రి పాల్గొని పూజలు నిర్వహించారు.