Slider తెలంగాణ

కేంద్రం ఇవ్వకున్నా ఆగకుండా సంక్షేమం

satyavathi rathod

శిశువు కడుపులో పడ్డప్పటి నుంచి తల్లి, బిడ్డల ఆరోగ్యం కోసం, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు అన్ని రకాలుగా ఆదుకునే పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మాతా- శిశు ఆరోగ్య రక్షణలో సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి పథకాన్ని క్షేత్ర స్థాయిలో లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను కోరారు. మహిళా, శిశు- సంక్షేమ శాఖ కమిషనరేట్ లో నేడు మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ శాఖలో పని చేసే వారికి హోదాలు ముఖ్యం కాకుండా..మనసుతో పనిచేసే తత్వం ఉండాలి. ఇక్కడ చిన్న పిల్లలు,  మహిళలు అనేక సమస్యల్లో ఉండి మన దగ్గరకు వచ్చినపుడు మనసుతో పనిచేసి వారికి పరిష్కారం చూపాలి అని మంత్రి అధికారులను కోరారు. దేశం మొత్తంలో అంగన్వాడీ ఉపాధ్యాయులకు అత్యధిక వేతనాలు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రంలోనేనని ఆమె తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సినన్ని నిధులు రాకున్నా…రాష్ట్ర ప్రభుత్వమే వాటిని భరిస్తూ మహిళలు, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు 60 శాతం నిధులు కేంద్రం నుంచి, 40శాతం నిధులు రాష్ట్ర వాటా గా ఇవ్వాల్సి ఉంటే తెలంగాణలో 70శాతంకి పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి వివరించారు. తల్లిపాల ప్రాధాన్యత పై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన రేడియో ప్రకటనలను మంత్రి ఆవిష్కరించారు.ఈ సమావేశంలో శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. జగదీశ్వర్, సంచాలకులు విజయేందిర బోయి, జువెనైల్ వెల్ఫేర్ డైరెక్టర్ బి. శైలజ, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Related posts

రామరాజ్యం కావాలా..? రాక్షస రాజ్యం కావాలా..?

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ రద్దును కేటీఆర్ ఏ హోదాలో చేశారు..?

Satyam NEWS

తిరుమ‌ల‌లో పార‌ద‌ర్శ‌కంగా గ‌దుల కేటాయింపు

Satyam NEWS

Leave a Comment