30.7 C
Hyderabad
April 29, 2024 06: 28 AM
Slider విజయనగరం

విజయనగరంలో కుంభవృష్టి: సహాయ చర్యల కోసం రంగంలోకి ఎమ్మెల్యే కోలగట్ల…!

#heavyrains

విజయనగరంలో ఈ సాయంత్రం కురిసిన భారీ వర్షం తో నగరం మొత్తం అతలాకుతలమైంది. ఎన్నడూ లేని విధంగా   భారీ వర్షం పడటతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి హుటాహుటిన ముంపునకు గురైన మంగళ వీధి, కోళ్ల బజార్ , మంచు కొండ వారి వీధి,తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు.

పరిస్థితులను సమీక్షించారు. మరోవైపు దాసన్నపేట సింగపూర్ సిటీ ప్రాంతం, దాసన్నపేట నూకాలమ్మ గుడి ప్రాంతం, ప్రశాంతి నగర్ ప్రాంతంలో మోకాలు లోతు నీటితో ప్రజలు వర్షంతో పడుతున్న ఇబ్బందులను ఫోన్ ద్వారా తెలియజేయడంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి అధికారులు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దాలని అధికారులను ఆదేశించారు. 

సింగపూర్ సిటీ ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించడానికి తన వాహనంలో వెళ్తున్న ఎమ్మెల్యే కోలగట్ల జమ్ము ప్రాంతం ఎర్ర చెరువు వద్ద ఒక కుటుంబం, రెండేళ్ల చిన్నారి వర్షంలో చిక్కుకోవడంతో వారిని ఎమ్మెల్యే కోలగట్ల తన వాహనంలో ఎక్కించుకున్నారు.ప్రజల ఎవరు బయటకు రావద్దని ఎమ్మెల్యే కోలగట్ల విజ్ఞప్తి చేశారు. మరోవైపు మున్సిపల్, విద్యుత్తు అధికారులతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Related posts

ప్రయివేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలి

Satyam NEWS

ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

దసరాకు ఊరికెళ్తున్నారా? కొల్లాపూర్ పోలీసుల సూచనలు

Satyam NEWS

Leave a Comment