34.2 C
Hyderabad
May 19, 2025 16: 41 PM
Slider నిజామాబాద్

జుక్కల్ లో ఘనంగా యువనేత జన్మదిన వేడుకలు

mla son

కామారెడ్డి జిల్లా  జుక్కల్ నియోజకవర్గం  శాసన సభ్యులు హనుమంత్ సిండే తనయుడు హరీష్ షిండే  జన్మదిన వేడుకలు నియోజకవర్గంలో  పండుగలా నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఆయన జన్మదినోత్సవ సందర్భంగా పుస్తకాలను చాక్లెట్లను ఆయా పాఠశాలల్లో అందజేశారు.

బిచ్కుంద మండల కేంద్రంలోని ఎస్సీ వాడ పాఠశాలలో విద్యార్థులకు హరీష్ షిండే   పుస్తకాలను చాక్లెట్లను పంచి పెట్టగా విద్యార్థులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జుక్కల్ మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల నాయకులు హరీష్ షిండే కేక్కట్ చేసి జన్మదినోత్సవాల్లో పాల్గొన్నారు.

మదునూరు పెద్ద కొడప్గల్ పిట్లం నిజాంసాగర్ మండలాల్లో యువజన విభాగం ఆధ్వర్యంలో యువ  నేత జన్మదిన వేడుకలలో నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద  ఎంపిపి అశోక్ పటేల్ మాజీ మార్కెట్ కమిటి అధ్యక్షులు రాజు, వెంకట్రావ్ దేశాయి, బొమ్మల లక్ష్మణ్ గణేష్ గొండ స్వామి, దేవాల చేతన్ స్వామి, జుక్కల్ లో సాయగౌడ్ స్వామి, బొల్లి  గంగాధర్, నీలు పటేల్  జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

Related posts

ఆస్ట్రేలియా టైటాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ పెస్టివ‌ల్‌లో ‘దహిణి’

mamatha

పెద్దమందడి పోలీస్ స్టేషన్ యస్.ఐ.కి ఛార్జ్ మెమో

Satyam NEWS

గవర్నర్ తో ‘‘సై’’ అంటున్న అధికార పక్షం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!