28.7 C
Hyderabad
April 26, 2024 08: 34 AM
Slider ముఖ్యంశాలు

జిల్లా అధికారులు సహాయక చర్యలు మరింత ముమ్మరం చెయ్యాలి

#seetakka

ములుగు జిల్లా అధికారులు సహాయక చర్యలు మరింత ముమ్మరం చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. ఎడతెరిపి లేని వాన ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తం అయిందని అన్నారు. గోదావరిలో క్రమేణా పెరుగుతున్న నీటి ప్రవాహం కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఆమె కోరారు.  స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు  సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. ముంపుకు గురైన ఇండ్లలో ఉన్న బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలి భోజన వసతి కల్పించాలని ఆమె అధికారులను కోరారు.

గత 5 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ప్రజలు ఎవ్వరూ బయటకు రాకుండా ఉండాలి. ములుగు నియోజక వర్గం లో  వాగులు, ఒర్రెలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. కాజువేలు, వంతెనల మీదుగా వరద నీరు పోతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

పక్కనే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి గోదావరిలోకి వరుద నీరు చేరి గోదావరి వదృతిగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా గోదావరి పరివహా ప్రాంతాలు ఏటూరు నాగారం,మంగపేట కాన్నాయి గూడెం,కొత్త గూడ మండలాల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి. ములుగు జిల్లాలో ఏటూరునాగారం, మేడారం జంపన్న వాగు ఉద్రితి పెరిగింది

కమలాపురం మధ్యలో ఉన్న జీడివాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది.  ఎగువ నుండి వరద పోటెత్తుతుండటంతో గోదావరి నది ప్రవాహం క్రమేణా పెరుగుతుంది. ఏకధాటి వానతో  ములుగుతో పాటు మహబూబాబాద్  చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని  భారీ వర్షాల నేపథ్యంలో గ్రామాల్లో తమ యంత్రాంగాన్నీ అలర్ట్  ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు అని సీతక్క అన్నారు.

Related posts

INTUC అధ్యక్షురాలిగా చౌడం శివపార్వతి నియామకం

Satyam NEWS

శోభాయమానంగా ధనుర్మాస శోభాయాత్ర

Satyam NEWS

మేం పాఠాలు చెప్పం… ఆ విషయం బయటకు తెలిస్తే ఊరుకోం

Satyam NEWS

Leave a Comment