28.7 C
Hyderabad
April 26, 2024 08: 40 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో పేదల ఇల్లు కూల్చడం దుర్మార్గం

కొల్లాపూర్ లో పేదల ఇల్లు కూల్చడం దుర్మార్గమని ఎమ్మార్పీఎస్ నాయకుడు కోళ్ళ శివ మాదిగ అన్నారు. అక్రమంగా పట్టాలు ఇచ్చిన అధికారులు, నాయకుల మీద కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లోని బస్ డిపో చుట్టూ పక్కల ఉన్న ఇళ్ళ పట్టాల ఈ విషయంలో అధికారులు చట్ట వ్యతిరేకం గా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి చట్టాలకు వ్యతిరేకమైన చర్యగా ఎమ్మార్పీఎస్ ఆరోపించింది.

పేదల కోసం కేటాయించిన స్థలాలలో అక్రమార్కులు నిజమైన లబ్ధిదారులను గుర్తించకుండా నిజమైన లబ్ధిదారులు అయినా దళితుల ఇల్లు కూల్చడం దుర్మార్గమైన చర్యగా ఆయన అన్నారు. ఈ విషయంలో కనీసం బాధితులకు నోటీసులు ఇవ్వకుండా వారి పట్టా సర్టిఫికెట్లను పరిశీలించకుండా రాత్రి సమయంలో కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. కొంతమంది అధికారులు చేసిన తప్పిదాల మూలంగా వాస్తవమైన పేదల ఇల్లు కూల్చడం సవివరమైన విచారణ చేయకపోవడం అధికారుల దుర్మార్గమైన చర్యగా పేర్కొంటున్నారు.

చట్టప్రకారం బాధితులతో వ్యవహరించాల్సిన అధికారులు తమ ఇష్టారాజ్యంగా అర్ధరాత్రి పూట ఇల్లు కూల్చడం అంటే చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడమే నని ఆయన అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా పేదల ఇల్లు కూల్చిన మున్సిపల్ రెవెన్యూ పోలీస్ అధికారుల మీద జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమంగా కూల్చివేసిన ఇళ్లను తక్షణమే ప్రభుత్వం పునర్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి మాదిగ సంపంగి మద్దిలేటి ఎదుల రాముడు బచ్చలకూర లక్ష్మణ్ రమేష్. మధు పరమేష్ కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ లో చేరనున్న రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్?

Satyam NEWS

అంబర్ పేట్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

Bhavani

‘తెల్మో మీటర్ గన్’ తో వైద్య పరీక్షలు నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment