26.7 C
Hyderabad
April 27, 2024 10: 03 AM
Slider నల్గొండ

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

#MRPS

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామ పంచాయితీ కార్మికులను సన్మానించామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగ తెలిపారు. నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం లోని వెలిమినేడు గ్రామంలో 16 మంది గ్రామ పంచాయతీ కార్మికులకు శాలువలతో సన్మానించి గుడ్లు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారికి భయపడి ఇంట్లో ఉన్న సందర్భాల్లో గ్రామపంచాయతీ కార్మికులు, పోలీసులు, డాక్టర్లు ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలను కాపాడుతున్నారని అన్నారు. గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ కార్మికులు డ్రైనేజీ మురికి కాలువలు, రోడ్లను శుభ్రం చేస్తూ కరోనా, ఇతర రోగాలు రాకుండా కష్టపడుతూ ఉద్యోగ భద్రత లేక చాలీచాలని జీతాలతో బ్రతుకును గడుపుతున్నారని ఆయన అన్నారు.

వీరికి ఉద్యోగ భద్రత కల్పించి నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఎమ్మార్పీఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ మాట్లాడుతూ లో పారిశుధ్య కార్మికులను ఏ సందర్భంలోనూ చులకన చేసి మాట్లాడకూడదని అందరితో సమానంగా గౌరవించాలని సమాజంలో మంచి గుర్తింపును ఇవ్వాలని కోరుకుంటున్నాను.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఎరసాని గోపాల్ మాదిగ, చిట్యాల మండల నాయకులు బుస్సు శంకర్, మేడి కృష్ణ మాదిగ, అంబాల ప్రవీణ్, మాంకాల లింగస్వామి, కొండాపురం శంకర్, చింతకింది వెంకటేశం, మార్గాలు శేఖర్, మాంకాల కిషన్, మాంకాల ముత్యాలు  గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్లీజ్ సేవ్: జీవో 4 7 7 9 రద్దు చేయాలని వినతి

Satyam NEWS

మైనార్టీ కార్పొరేషన్ బడ్జెట్ విడుదల చేయాలి

Satyam NEWS

విజయనగరం లో ఆకట్టుకున్నవయోలిన్ కచేరీ

Satyam NEWS

Leave a Comment