29.7 C
Hyderabad
May 2, 2024 04: 54 AM
Slider కృష్ణ

మున్సిపల్ పారిశుధ్య కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి

#rajendraprasad

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు రోజులుగారాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఉయ్యూరులోని కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు తెలుగుదేశం పార్టీ మరియు పంచాయతీ రాజ్ ఛాంబర్ తరుపున మద్దతు తెలిపారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళ కార్మికులు వృత్తి పరంగా తమకున్న ఇబ్బందులు మరియు సమస్యలపై మాట్లాడిన కార్మికులను అధికారులు ఏకపక్షంగా తొలగించడంవంటి సమస్యలను వై.వి.బి కి విన్నవించారు.

ఈ సందర్భంగా వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యంత్రి వైఎస్ జగన్ అనాడు ప్రతిపక్ష నేతగా తన పాదయాత్రలో పారిశుధ్య కార్మికులకు అనేక హామీలు ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకుని తీరా అధికారం లోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని అన్నారు. గత తెలుగు దేశం ప్రభుత్వ హాయాంలో ముఖ్య మంత్రి చంద్రబాబు కార్మికుల సంక్షేమమే ధ్యేయం గా పని చేశారని అన్నారు.

జగన్మోహనరెడ్డి ప్రభుత్వం  మున్సిపల్ కార్మికుల తో పాటు రాష్ట్రం లోని అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ లు అయిన హెల్త్ అలవెన్స్, సమాన పనికి సమాన వేతనం, సిబ్బందిని పెంచడంతో పాటు కార్మికులు చేస్తున్న అన్ని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

కార్మికుల సమస్యలను తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దృష్టి కి తీసుకెళతామని అదేవిధంగా పంచాయతీ రాజ్ ఛాంబర్ తరపున కూడా కార్మికుల తరపున పోరాటం చేస్తామన్నారు. అనంతరం వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ కార్మికుల పోరాటానికి మద్దతుగా ఆర్థిక సహాయం చేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పళ్యాల శ్రీనివాసరావు టిడిపి నాయకులు పరిమి భాస్కర్,సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి,బూరెల నరేష్, చలపాటి శ్రీను, జంపాననర్సింహారావు పవన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైభ‌వంగా పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

Satyam NEWS

కడప నగరంలో ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ల దగ్ధం

Satyam NEWS

మహాత్మాగాంధీని అవమానించిన చైనా

Satyam NEWS

Leave a Comment