40.2 C
Hyderabad
April 29, 2024 15: 51 PM
Slider ముఖ్యంశాలు

వీళ్లు మామూలోళ్లు కాదు హైవే హంతకులు

culprits

దిశ హత్య కేసులో నిందితులైన నలుగురు పోలీసు ఎన్ కౌంటర్ లో మృతి చెందితే మానవ హక్కుల సంఘాలు పెద్ద గొడవ చేసేస్తున్నాయి. వారు జరిపిన నేరాల గురించి తెలుసుకుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితుల వాంగ్మూలంలో కీలక విషయాలు వెలుగు చూశాయని తెలిసింది. 

దిశ హత్యకు ముందు మరో 9 మంది మహిళలపై హత్యాచారం జరిపినట్టుగా వాంగ్మూలంలో నిందితులు అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రధాన సూత్రధారి ఆరిఫ్‌ అలీ 6 హత్యలు చేశాడు. చెన్నకేశవులు 3 హత్యలు చేసినట్లు అంగీకరించారని తెలుస్తోంది. ఈ హత్యలన్నీ మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్నాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారని సమాచారం.

ప్రతి ఘటనలోనూ మహిళలపై అత్యాచారం చేయడం ఆ తర్వాత వారిని హత్య చేసి మృతదేహాలను కాల్చేయడం వీరికి అలవాటుగా మారింది. ఈ వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాళ్లు చెప్పిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు మొత్తం 15 సంఘటనలు జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాటన్నింటికి సంబంధించిన డీఎన్‌ఏ నివేదికలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

అయితే చాలా వాటిల్లో మృతదేహలు పూర్తిగా కాలిపోవడంతో.. డీఎన్‌ఏ పరీక్షల్లో సరైన ఫలితాలు రాలేదని సమాచారం. దీంతో శాస్త్రీయ పద్ధతుల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దిశ కేసు నిందితుల డీఎన్‌ఏను 15 మంది మృతుల డీఎన్‌ఏలతో విశ్లేషిస్తున్నారు. దిశ కేసు చార్జిషీట్‌లో నిందితుల నేరాల చిట్టా పొందుపర్చే అవకాశం ఉంది.

Related posts

అవార్డు రావడంతో మరింత బాధ్యత : చైర్‌పర్సన్ ముల్లి పావని

Satyam NEWS

కాగజ్ నగర్ లో ఘనంగా నందమూరి జయంతి

Satyam NEWS

అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Satyam NEWS

Leave a Comment