30.3 C
Hyderabad
March 15, 2025 10: 39 AM
Slider ఆంధ్రప్రదేశ్

రిక్వెస్ట్: చంద్రబాబు ముస్లింలకు అండగా నిలబడాలి

muslim CB

ఎన్.ఆర్.సి, సి.ఏ.బి, సి.ఏ.ఏ, ఎన్.పి.ఆర్. లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పోరాటం చేయాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు నరసరావుపేట ముస్లిం జేఏసీ నాయకులు వినతిపత్రం అందచేశారు. నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో చంద్రబాబును నరసరావుపేట ముస్లిం జేఏసీ నాయకులు కలిశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. టిడిపి అధికారంలోకి లేకపోవడంతో ఈ రోజు ప్రజలకు అనేక సమస్యలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 24 న శుక్రవారం నరసరావుపేట లో జరిగే ముస్లిం జేఏసీ ర్యాలీ కి, రావాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, ముస్లిం జేఏసీ నాయకులు ఆహ్వానం పలుకగా చంద్రబాబు  సానుకూలంగా స్పందించారు.

అమరావతి కోసం చేపట్టిన పాదయాత్ర ను విజయవంతం చేసినందుకు, చంద్రబాబు, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ను ముస్లింలు అభినందించారు. రాజధాని అమరావతి కోసం నరసరావుపేట డాక్టర్స్ ,నరసరావుపేట ప్రజలు విరాళాల్లో రాష్ట్ర లోనే ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు  ప్రశంసించారు. రానున్న రోజుల్లో అమరావతి కోసం పోరాటం కొనసాగించాలని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు మాజీ సీఎం సూచన చేశారు.

Related posts

మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పై నిర్లక్ష్యం సిగ్గుచేటు

Satyam NEWS

మిస్టరీ: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో యువతి బలి

Satyam NEWS

పల్నాడు జిల్లాలో పోలీసుల ఉక్కు పాదం

Satyam NEWS

Leave a Comment