32.7 C
Hyderabad
April 27, 2024 00: 10 AM
Slider శ్రీకాకుళం

వ్యాయామ ఉపాధ్యాయుడు బాల మోహన్ కు నంది అవార్డు

#GundaBalaMohan

శ్రీకాకుళం పట్టణానికి చెందిన డాక్టర్ గుండ బాల మోహన్ నంది జాతీయస్థా యి విశిష్టత పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన 15 సంవత్సరాల నుంచి  వ్యాయామ విద్య వృత్తి లో ఉన్నారు.

పలు ఉపాధ్యాయ శిక్షణా మండలి కళాశాలలో వ్యాయామ అధ్యాపకుడుగా, పలు ఇంజనీరింగ్ కళాశాలలో వ్యాయామ విద్య ఆచార్యునిగా పని చేశారు.

2013 సంవత్సరం నుంచి స్థానిక  శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గా పని చేస్తున్నారు.

ఈయన వద్ద శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి, కుస్తీ పోటీలో నూ, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని పలు విజయాలు సాధించారు.

అదేవిధంగా ఈయన ప్రపంచ మల్లయోధుడు, కలియుగ భీముడు, కీర్తిశేషులు కోడి రామ్మూర్తి, శ్రీకాకుళం జిల్లా యువజన సంక్షేమ సంఘం అధ్యక్షులు గానూ కొనసాగుతున్నారు.

పేద విద్యార్థులలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసి సొంత ఖర్చులతో విద్యార్థులను రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పోటీలకు బాల మోహన్ పంపిస్తుంటారు.

ఆయన చేసిన ఈ సేవలకు గాను తెలుగు నంది జాతీయ విశిష్టత పురస్కారం 2021 కు ఎంపికయ్యారు.

ఆదరణ, ఆలయం చారిటీస్ సమర్పణలో  వేదిక సీ. సీ. టీవీ సొసైటీ, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఈ పురస్కారం అందజేస్తున్నారు.

ఈనెల 28న కృష్ణా జిల్లా విజయవాడలో ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డును అందుకోబోతున్నారు.

తనకు ఈ అవార్డును అందజేస్తున్న సీ. సీ. టీవీ అధ్యక్షుడు డాక్టర్ ఆరవెల్లి నరేంద్రకు బాల మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

“ఆరోగ్య మహిళ”కు విశేష స్పందన: మంత్రి హరీశ్ రావు

Satyam NEWS

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారు?

Satyam NEWS

ఘనంగా శ్రీ గోదా రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

Leave a Comment