42.2 C
Hyderabad
April 26, 2024 15: 21 PM
Slider ఖమ్మం

బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నారాయణ

#bcsangham

జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా నారాయణ వరపు శ్రీనివాస్ ను నియమిస్తూ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ఆ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు . ఈ సందర్భంగా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ ను ఉద్దేశించి మాట్లాడారు . గత 15 సంవత్సరాలుగా బీసీ ఉద్యమ బలోపేతానికి నారాయణవరపు శ్రీనివాస్ ఎనలేని కృషి చేశారని . దాని ఫలితంగానే పూర్తి హక్కులతో కూడిన బాధ్యతలను అప్పగించడం జరిగిందని తెలిపారు . అనంతరం ఆర్ కృష్ణయ్య నూతన జిల్లా అధ్యక్షుని సన్మానించారు . శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ , జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ , జాతీయ ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడేపల్లి కృష్ణమాచారి , బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య , విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి , రాష్ట్ర నాయకులు రాజేందర్ , సాగర్ భూపేంద్ర రామకోటి , సుధాకర్ జిల్లాకు చెందిన సంఘ నాయకులు లింగనబోయిన పుల్లారావు , వెంకటాచారి , మరీదు ప్రసాద్ , జిల్లా అధికార ప్రతినిధి పంతంగి వెంకటేశ్వర్లు , రాఘవ , అశోక్ మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలిపారు .

Related posts

రాజకీయాలకు అతీతంగా అందరిని ఆదుకోవాలి

Satyam NEWS

చిరువ్యాపారులకు అండగా నిలిచిన సిర్పూర్ ఎమ్మెల్యే

Satyam NEWS

రెడ్ల ప్రభుత్వం రావాలనుకున్న వాళ్లకు బుద్ధి వచ్చింది

Satyam NEWS

Leave a Comment