28.7 C
Hyderabad
April 26, 2024 10: 53 AM
Slider జాతీయం ప్రత్యేకం

విక్రమ్ ల్యాండర్ పై నాసా తాజా అప్ డేట్ ఇది

vikram lander 1

విక్రమ్ ల్యాండర్ బలవంతంగా విడిపోవడం వల్లే సంకేతాలు ఆగిపోయారని నాసా నిర్ధారించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్‌ 2’లోని విక్రమ్ ల్యాండింగ్ కోసం ముందుగా నిర్దేశించిన ప్రాంత ఫొటోలను నాసాకు చెందిన ఎల్ఆర్వో(లూనార్ రెకొనైసెన్స్ ఆర్బిటర్) తీసింది. సెప్టెంబర్ 17న ఈ ఫొటోలను తీయగా వాటిని తాజాగా విడుదల చేసింది. రాత్రి సమయంలో తీయడం వలన విక్రమ్ ల్యాండర్ ఎక్కడ లొకేట్ అయ్యిందో గుర్తించలేకపోతున్నామని నాసా ప్రకటించింది. అయితే అక్టోబర్‌లో పగలు సమయం వస్తుందని.. అప్పుడు విక్రమ్‌కు చెందిన పలు ఫొటోలను తీస్తామని ఆ సంస్థ తెలిపింది. ”విక్రమ్ ల్యాండర్‌ హార్డ్‌గా ల్యాండ్ అయింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ఎక్కడ ల్యాండ్ అయ్యింది అనే విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది” అని నాసా వెల్లడించింది. అక్టోబర్ 14న మరోసారి ఎల్ఆర్వో.. విక్రమ్ ల్యాండ్ అయిన స్థానం నుంచి ప్రయాణించనుంది. అప్పుడు పగటి సమయం ఉండటం వలన ల్యాండర్ స్థానాన్ని గుర్తించేందుకు పరిస్థితులు మరింత అనుకూలించనున్నాయి” అని ఆ ఆర్బిటర్‌ మిషన్‌కు చెందిన డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లర్ ఓ మెయిల్‌లో తెలిపారు. కాగా నాసా జూలై 22న చంద్రయాన్ 2ను ప్రతిష్టాత్మకంగా ప్రయోగించింది. అన్ని కక్ష్యల్లోనూ విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్ 2.. చంద్రుడి కక్ష్యకు మరో 2.1కి.మీ దూరంలో ఉందనగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ఆ తరువాత దానితో సంబంధాలు మెరుగుపరిచేందుకు ఇస్రోతో పాటు నాసా శాస్త్రవేత్తలు పలు విధాలుగా ప్రయత్నించారు. అయితే చంద్రుడిపై రాత్రి సమయం రావడంతో వారి ప్రయత్నాలకు విఘాతం కలిగింది. మరోవైపు ల్యాండర్‌ చంద్రుడిని గట్టిగా తాకి ఉంటుందని.. అందుకే సంకేతాలు నిలిచిపోయాయని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ల్యాండర్ నుంచి ఏ సమాచారం రానప్పటికీ.. ఆర్బిటర్ మాత్రం బాగా పనిచేస్తోందని ఇస్రో చైర్మన్ కె.శివన్ తాజాగా వెల్లడించారు. అలాగే మరో చంద్రయాన్ మిషన్‌ ప్రయోగంపై యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు

Related posts

రైతుల కోసం టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా

Satyam NEWS

విషాదం : మరణించిన ఆలయ ఉద్యోగి శివ తల్లి గుండెపోటు తో మృతి

Satyam NEWS

విద్యల నగరంలో వ్యాపారి కిడ్నాప్…24 గంటలలో కేసు ఛేదింపు

Satyam NEWS

Leave a Comment