ఒకప్పుడు జర్నలిజానికి రంగూ రుచీ వాసన ఉండేవి కావు. ఏ రాజకీయ రంగులు పులుముకోకుండా, ఏ రాజకీయ వాసనలు అంటుకోకుండా, యజమానుల రాజకీయ వైఖరులతో నిమిత్తం లేకుండా ఎంతోకొంత స్వతంత్రంగా వ్యవహరించగల స్థితి వుండేది. ఆ రోజుల్లో ఇలాంటి రచనలు విరివిగా పత్రికల్లో వెలువడుతుండేవి. ఎడిటర్లు కూడా అలాంటి చేవ ఉన్న రచయితలను వెతికి పట్టుకుని రాయించడం నాకు తెలుసు. ఇప్పుడు అలా లేదు. ‘మీ వ్యాసం చివర్లో ఒకటి రెండు వాక్యాలు ‘ఇబ్బంది’ పెట్టేవిగా వున్నాయి. అంచేత ప్రచురించడం లేదు’ అని సంపాదక వర్గంలో బాధ్యులు ఫోన్ చేసి చెబుతున్నారంటే విషయం అర్ధం చేసుకోవచ్చు. రవంత ‘వ్యతిరేకత’ ను కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఉన్నత న్యాయస్థానం చెప్పింది కూడా, ‘ విభిన్న అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్చ ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ అని. అయినా పట్టించుకునేవాళ్ళు లేరు.
previous post