30.7 C
Hyderabad
April 29, 2024 05: 39 AM
Slider తెలంగాణ

అవినీతిపరులను పట్టిస్తే బైక్, బంగారం

wgl acb

అంతర్జాతీయ అవినీతి వారోత్సవాల సందర్భంగా వరంగల్ కేంద్రంగా ఉన్న అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల వినూత్న కార్యక్రమానికి నాంది పలికింది. అవినీతిపరులను ఏసీబీకి పట్టించి బైక్, బంగారం, సెల్ ఫోన్ బహుమతులుగా గెలుచుకోండి అంటూ పోస్టర్ లను విడుదల చేసింది.

వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత ఈ పోస్టర్ లను బుధవారం విడుదల చేశారు. అవినీతికి వ్యతిరేకంగా యువత పోరాడాలని, తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. డిసెంబర్ 5 నుంచి 9 వరకు  రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి  ప్రభుత్వ అధికారులను ఏసీబీ పట్టించిన వారికి బైక్,  మండల స్థాయి అధికారులకు  తులం బంగారం, గ్రామస్థాయి అధికారులు అయితే సెల్ ఫోన్ బహుమతిగా అందిస్తామని జ్వాల సంస్థ ప్రకటించింది.

  వివరాలకు ఫోన్ 9390 1011 28 పై  సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో లోక్సత్తా ఉద్యమ సంస్థ రాష్ట్ర సలహాదారుడు  ప్రొఫెసర్ పర్చా కోదండ రామారావు,  జ్వాల వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్,  శ్రీవల్లి డెవలపర్స్ అధినేత నూనె పూర్ణ చందర్, గణపతి శిల్పి వర్క్ ప్రొప్రైటర్ శిల్పి సుందర్, జ్వాలా సభ్యులు మంద అశోక్ కుమార్, గొల్ల నరేందర్, నిజాం, పాల్గొన్నారు.

Related posts

కాపు రిజర్వేషన్లపై నోరు మెదపకపోతే ఎలా సారూ?

Satyam NEWS

రిక్వెస్ట్: చంద్రబాబు కుట్రలపై రాష్ట్రపతికి లేఖ

Satyam NEWS

గ్రామ స్థాయిలో నాటు సారా నియంత్రణకు కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment