27.7 C
Hyderabad
April 26, 2024 06: 58 AM
Slider మహబూబ్ నగర్

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కొత్త చరిత్ర

#MinisterSingireddy

ఒకప్పుడు సమస్యలు సర్కారు దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రజలు రోడ్ల మీదకు వచ్చేది. ఈ రోజు ప్రజల అవసరాలు గుర్తెరిగి పనిచేస్తున్న ప్రభుత్వానికి అభినంనదనలు తెలిపేందుకు రోడ్ల మీదకు రావడం తెలంగాణలో కొత్త చరిత్ర అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రైతు అభినందన సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఎక్సైజ్ , టూరిజం శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సభలో మంత్రి మాట్లాడుతూ పంటల కాలంలో ఇంత పెద్ద ఎత్తున రైతులు తరలిరావడం సీఎం కేసీఆర్ మీద ఉన్న అభిమానానికి నిదర్శనమని అన్నారు. వ్యవసాయరంగం బలోపేతం అయితే సమాజం సంతోషంగా ఉంటదని ఆరేళ్లుగా కేసీఆర్ వ్యవసాయదారుల అనుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి అన్నారు.

ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లోనూ వ్యవసాయానికి ఉచిత 24 గంటల కరంటు లేదని అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్నదని మంత్రి తెలిపారు.

రైతుభీమాతో వ్యవసాయ కుటుంబాలకు అండ దొరికిందని రైతు మరణించిన వారంలో పైరవీకారులతో సంబంధలేకుండా నేరుగా రైతు కుటుంబసభ్యుల ఖాతాలో రూ.5 లక్షలు జమ అవుతాయి .. ఈ పథకం దేశంలో ఎక్కడా లేదని మంత్రి వెల్లడించారు.

9 నెలల్లో భూరికార్డుల సర్వే చేయించి రైతులకు కొత్త పాస్ బుక్ లు అందజేసి దాని ఆధారంగా ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు రైతుబంధు పథకం వర్తింపజేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులకు భూ సమస్యలు ఉండొద్దు .. గ్రామాలు ప్రశాతంగా ఉండాలని భావించి కేసీఆర్ కొత్త రెవిన్యూ చట్టం అమల్లోకి తీసుకువచ్చారని ఇక రైతులు, భూయజమానులు భూరికార్డులు, భూ హక్కుల విషయంలో  భయపడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు.

రైతుల పాలిట శాపం కేంద్ర వ్యవసాయ చట్టం

కేంద్ర వ్యవసాయ చట్టం దేశ రైతాంగం పాలిట శాపం. కార్పోరేట్లు, బహుళజాతి కంపెనీలకు రైతుల కష్టం దోచిపెట్టేందుకే కేంద్ర వ్యవసాయ చట్టం తీసుకువచ్చిందని ఆయన అన్నారు.

కేంద్ర వ్యవసాయ చట్టాన్ని టీఆర్ఎస్ తో పాటు 12 పార్టీలు పార్లమెంటులో లోపలా, బయటా వ్యతిరేకించాయని ఆయన తెలిపారు. వ్యవసాయ బిల్లుల చట్టంపై వ్యతిరేకత చూసి కరంటు చట్టాన్ని పక్కకు పెట్టింది .. అది వస్తే రైతులు, వ్యవసాయరంగ పరిస్థితి అధోగతే.

కేంద్రం రైతుల మోటర్లకు మీటర్లు పెడితే కేంద్రాన్ని నడిపే బీజేపీ పార్టీకి రైతులు మీటర్లు పెడతారని మంత్రి సింగిరెడ్డి అన్నారు.

పాడిపంటలతో తులతూగిన కొల్లాపూర్ 70 ఏళ్ల సమైక్య పాలనలో కోన్ పూచ్ తా కొల్లాపూర్ గా మారిందని, ఆరేండ్ల పాలనతో కేసీఆర్ పూర్వ వైభవం తీసుకువచ్చారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Related posts

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరిక‌లు

Bhavani

ఆదిలాబాద్ అడవులను జల్లెడపడుతున్న పోలీసులు

Satyam NEWS

దుర్గామాత ఆశీస్సులు తీసుకున్న బిజెపి నాయకులు

Satyam NEWS

Leave a Comment