సినీ పరిశ్రమలో గ్లామర్ ను కాకుండా కేవలం తన నటనతోనే ప్రేక్షకులను మంత్రముగ్ధులనుచేసే హీరోయిన్లు చాలా అరుదు. అలాంటి కోవకు చెందిన నిత్యామీనన్ తాజాగా తన 50వ చిత్రాన్ని చేస్తున్నది. తొలి నుంచి కూడా కేవలం ఎంపిక చేసుకున్న చిత్రాలనే నిత్యా మీనన్ చేస్తున్నది. తాజాగా మిషన్ మంగళ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన యాక్టింగ్ స్కిల్స్ చూపించి మంచి పేరు తెచ్చుకుంది.1998 లో మొదటిసారి తెరపై మెరిసిన నిత్య, ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి 49 సినిమాలు చేసింది. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులని సృష్టించుకున్న ఈ కేరళ కుట్టి, తన 50 వ సినిమా పోస్టర్ ని ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆరం తిరుకల్పన పేరుతో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని అజయ్ దేవలోక డైరెక్ట్ చేస్తున్నాడు. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.
previous post